ఆగష్టు 14, 2019
ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర కు
నిర్దేశాల జారీ - అవధి పొడిగింపు
ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర ను, మే 19, 2018 వ తేదీ పనిముగింపు వేళ నుండి భారతీయ రిజర్వు బ్యాంకు తమ నిర్దేశాల (మే 18, 2018 వ తెదీ నాటి నిర్దేశం ద్వారా) క్రిందకు తీసుకువచ్చింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ప్రజల సమాచారంకోసం తెలియజేయునది యేమనగా పైన పేర్కొనబడిన నిర్దేశం వర్తింపు అక్టోబర్ 19, 2019 వ తేదీ వరకు కొనసాగుతుందని; సమీక్షకు లోబడి తమ ఆగస్ట్ 05, 2019 తేదీ డైరెక్టివ్ ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారని.
పైన పేర్కొనబడిన గడువు పొడిగింపు నిర్దేశం నకలును ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ప్రదర్శించటం జరుగుతుంది.
భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న పొడిగింపు మరియు / లేదా సవరణ ను అన్యధా బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా పరిగణించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/437 |