Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (125.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/08/2019
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ తోపాటు సెక్షన్ 56 క్రింద (ఏఏసియస్) నిర్దేశాలు – డా.శివాజీరావు పాటిల్ నీలంగేకర్ కో -ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (మహారాష్ట్ర) – సర్వ సంఘటిత నిర్దేశాల పొడిగింపు

ఆగస్ట్ 16, 2019

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ తోపాటు సెక్షన్ 56 క్రింద
(ఏఏసియస్) నిర్దేశాలు – డా.శివాజీరావు పాటిల్ నీలంగేకర్ కో -ఆపరేటివ్ బ్యాంక్
లిమిటెడ్ (మహారాష్ట్ర) – సర్వ సంఘటిత నిర్దేశాల పొడిగింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ సబ్- సెక్షన్ (1), తో పాటు సెక్షన్ 56 క్రింద తనకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ప్రజల మేలుకై డా.శివాజీరావు పాటిల్ నీలంగేకర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నిలంగా, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర కు ఆరు నెలల పాటు అమలులో ఉండేలా ఫిబ్రవరి 16, 2019 వ తేదీ పని ముగింపు వేళల నుండి ఆగస్ట్ 15, 2019 వరకు నిర్దేశాలను జారీ చేసింది. భారతీయ రిజర్వు బ్యాంకు ఇపుడు ఈ ఆదేశాలను రెండు నెలల కాలానికి ఆగస్ట్ 16, 2019 నుండి అక్టోబర్ 15, 2019 వరకు తిరిగి పొడిగించింది. ఈ ఆదేశాల నియమానుసారం అనేక ఆంక్షలు మరియు / లేదా నగదు ఉపసంహరణ / డిపాజిట్ల స్వీకరణపై గరిష్ఠ పరిమితులు ఉంటాయి. వివరాలతో కూడిన ఆదేశాల నకలును ఆసక్తి గల ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ఉంచడం జరుగుతుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంకు తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చు. ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా, బ్యాంక్ లైసెన్స్ ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దుచేసినట్లుగా ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్దిక పరిస్థితి మెరుగయ్యేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంక్ తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/457

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….