తేది: 02/08/2019
స్వర్ణ భారతి సహకార బ్యాంక్ నియమిత, బెంగళూరు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు
ద్వారా జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) జులై 25, 2019 నాటి ఆదేశం ప్రకారం, ‘మూడవ పార్టీ ఖాతా చెల్లింపుదారుల చెక్కుల సేకరణ’ ఫై జారీ చేసిన నిబంధనల అనుపాలనా లోపం కొరకు, స్వర్ణ భారతి సహకార బ్యాంక్ నియమిత, బెంగళూరు ఫై ₹10.00 లక్షలు (పది లక్షల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించింది.
ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు 56తో కలిపి సెక్షన్ 47A(1)(c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంక్ విఫలమైనందువల్ల విధించడం జరిగింది.
ఈ చర్య అనుపాలనా లోపం కొరకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద అభిప్రాయ వ్యక్తీకరణ కాదు.
నేపథ్యం
ఫిర్యాదుల ఆధారంగా, స్వర్ణ భారతి సహకార బ్యాంక్ నియమిత, బెంగళూరు ఖాతాల/ దస్తావేజుల ఫై ఆర్బిఐ నిర్వహించిన తనిఖీలో, మిగతావాటితో కలిపి ఆర్బిఐ ఆదేశాలకు విరుద్ధంగా ₹50,000 కంటే ఎక్కువ మొత్తాలకు క్రెడిట్ సొసైటీ సభ్యులకు అనుకూలంగా డ్రా అయిన మూడవ పార్టీ ఖాతా చెల్లింపుదారుల చెక్కులను సేకరిస్తున్నట్లు వెల్లడైంది. ఆర్‌బిఐ జారీ చేసిన పై ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదని బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.
బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలోని మౌఖిక నివేదనలు మరియు తదనంతర అదనపు నివేదనలు పరిగణించిన తరువాత, ఆర్.బి.ఐ ఆదేశాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణ వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, ఆర్.బి.ఐ నిర్ధారణకు వచ్చింది.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/335 |