తేదీ: 13/09/2019
ది మెహమదాబాద్ అర్బన్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మెహమదాబాద్ పై,
రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ సెప్టెంబర్ 11, 2019 ద్వారా, ది మెహమదాబాద్ అర్బన్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మెహమదాబాద్ (బ్యాంక్) పై 2 లక్షల రూపాయిల, నగదు జరిమానా విధించింది. బ్యాంక్ డైరెక్టర్లకు అప్పులు/రుణాల జారీ, కె వై సి నిబంధనలు/ఏ ఎల్ ఎమ్ ప్రమాణాలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలు పాటించని కారణంగా, ఈ జరిమానా విధించబడింది.
పై ఉల్లంఘనల కారణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4)(i) మరియు సెక్షన్ 56 తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజరిమానా విధించినది.
నియంత్రణా మార్గదర్శకాలు పాటించుటలో లోపాలు జరిగిన కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప. బ్యాంకు, ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు / చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు.
నేపథ్యం:
రిజర్వ్ బ్యాంకుకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బ్యాంకుయొక్క పుస్తకాలూ, ఖాతాలు తనిఖీ చేయబడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ జరిపిన తనిఖీలో, మిగిలిన అంశాలతోబాటు, బ్యాంకు డైరెక్టర్లకు రుణాల జారీ, కె వై సి నిబంధనలు/ఏ ఎల్ ఎమ్ ప్రమాణాలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించుటలేదని వెల్లడయింది. పై మార్గదర్శకాలు పాటించనందుకు, నగదు జరిమానా ఎందుకు విధించరాదో తెలపమని బ్యాంకుకు నోటీస్ జారీచేయబడింది.
బ్యాంక్ సమర్పించిన జవాబు, ప్రత్యక్ష సమావేశంలో చేసిన విజ్ఞాపనలు, సమావేశం తరువాత చేసిన అదనపు విన్నపాలు పరిశీలించిన తరువాత, బ్యాంకు, పై విషయాలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు పాటించలేదన్న ఆరోపణలు నిజమేనని, అవి జరిమానా విధింపతగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిశ్చయించింది.
యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/699
|