తేదీ: 25/09/2019
యు. పి సివిల్ సెక్రటేరియట్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, (ఉత్తర్ ప్రదేశ్) –నిర్దేశాల అమలుకాలం పొడిగింపు
యు. పి. సివిల్ సెక్రటేరియట్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నోకు జారీచేసిన నిర్దేశాల అమలుకాలం, రిజర్వ్ బ్యాంక్, మరొక ఆరు నెలలు - అనగా సెప్టెంబర్ 26, 2019 నుండి మార్చ్ 25, 2020 వరకు పొడిగించినది. దీనిని సమీక్షించవచ్చు. బ్యాంకు, సెప్టెంబర్ 25, 2018 నుండి, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35A, సబ్-సెక్షన్ (1) క్రింద, సెప్టెంబర్ 19, 2018 తేదీన జారీచేసిన నిర్దేశాలకు లోబడి ఉన్నది.
సెప్టెంబర్ 25, 2019 వరకు అమలులో ఉన్న ఈనిర్దేశాలు, మరొక ఆరు నెలలు, సెప్టెంబర్ 26, 2019 నుండి మార్చ్ 25, 2020 వరకు, సెప్టెంబర్ 24, 2019 తేదీ ఆదేశాల ద్వారా, సమీక్షకులోబడి, పొడిగించబడినవి. సెప్టెంబర్ 24, 2019 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, యు. పి. సివిల్ సెక్రటేరియట్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో, ప్రజల సమాచారంకొరకు ప్రదర్శించబడినది.
నిర్దేశాలలో పైన తెలిపిన మార్పు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిందనిగాని లేక దిగజారిందని గాని, ఏ మాత్రమూ భావించరాదు. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్దేశాలలో మార్పుచేయవచ్చు.
యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/785
|