తేది: 23/10/2019
భాగ్యోదయ ఫ్రెండ్స్ నగర సహకార బ్యాంక్ లిమిటెడ్. వరుద్,
జిల్లా-అమరావతి, మహారాష్ట్ర -
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు
వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి
పొడిగింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, భాగ్యోదయ ఫ్రెండ్స్ నగర సహకార బ్యాంక్ లిమిటెడ్. వరుద్, జిల్లా-అమరావతి, మహారాష్ట్ర ఫై జనవరి 17, 2019 పని వేళల ముగింపు నుండి భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలు విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు అట్టి నిర్దేశాల కాల పరిమితిని మరో ఆరు నెలలపాటు అంటే అక్టోబర్ 18, 2019 నుండి ఏప్రిల్ 17, 2020 వరకు సమీక్షకు లోబడి, మరింత పొడిగించింది. డిపాజిట్ల ఉపసంహరణ/స్వీకరణ విషయంలో పై నిర్దేశాలు కొన్ని పరిమితులు మరియు/లేక ఆంక్షలు విధిస్తాయి. నిర్దేశాల యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. పరిస్థితుల దృష్ట్యా, నిర్దేశాలలో మార్పులను భారతీయ రిజర్వు బ్యాంకు పరిగణలోకి తీసుకొనవచ్చును. జారీ చేసిన ఫై నిర్దేశాలు, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసినట్లు భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు పరిమితులతోకూడిన బ్యాంకింగ్ వ్యాపారాన్ని బ్యాంకు కొనసాగించవచ్చు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1011 |