నవంబర్ 18, 2019
మిల్లత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, దావణగెరె - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్
35ఎ క్రింద (ఏఏసియస్) ఇచ్చిన సర్వ సంఘటిత నిర్దేశాల అవధి పొడిగింపు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మిల్లత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, దావణగెరె కు, డిసిబియస్.సిఓ.బియస్డి-III. నం.డి-12/12.23.096/2018-19 తేదీ ఏప్రిల్ 26, 2019 న జారీచేయబడిన డైరెక్టివ్ అమలు అవధి ని పొడిగించడం అవశ్యకమని భారతీయ రిజర్వు బ్యాంకు భావిస్తున్నదని ఇందుమూలంగా తెలుపడమైనది.
తదనుగుణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ(1) తో పాటు సెక్షన్ 56 ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ఇందుమూలంగా నిర్దేశిస్తున్నది - మిల్లత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు జారీచేయబడిన డైరెక్టివ్ డిసిబియస్.సిఓ.బియస్డి-III.నం. డి-12/12.23.096/2018-19 తేదీ ఏప్రిల్ 29, 2019 చెల్లుబాటు వర్తింపు నవంబర్ 07, 2019 వరకు ఉండి, మరో ఆరు మాసాలబాటు నవంబర్ 08, 2019 నుండి మే 07, 2020 తారీఖు వరకు సమీక్షకు లోబడి ఆ బ్యాంక్ కు కొనసాగుతుంది.
పైన సూచించబడిన డైరెక్టివ్ లోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు. భారతీయ రిజర్వు బ్యాంకు పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన బ్యాంక్ యొక్క లైసెన్స్ రద్దు చేసినట్లుగా భావించరాదు. బ్యాంక్ వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడేంతవరకు, కొన్ని నిబంధనల మేరకు బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కొనసాగిస్తుంది. పరిస్థితులనుబట్టి, రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాల కు మార్పులు చేయవచ్చు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1148 |