నవంబర్ 15, 2019
ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి
అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంకు మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంకు వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది:
| క్రమసంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
| 1. |
ప్రోటెక్ ఫైనాన్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
డి-70, పంచశీల్ ఎంక్లేవ్, న్యూ ఢిల్లీ – 110 017 |
14-01017 |
మే 15, 2000 |
సెప్టెంబర్ 24, 2019 |
| 2. |
టీసన్స్ ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ |
20/22, ఈస్ట్ పంజాబీబాగ్, న్యూ ఢిల్లీ – 110 026. |
బి-14.02496 |
నవంబర్ 03, 2001 |
సెప్టెంబర్ 30, 2019 |
| 3. |
హిల్మ్యాన్ క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఇంతకుమునుపు జేకే క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్) |
కమలా టవర్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్-208 001. |
బి.12.00209 |
ఫిబ్రవరి 13, 2007 |
అక్టోబర్ 04, 2019 |
| 4. |
గేలార్డ్ ఇమ్పెక్స్ లిమిటెడ్ |
మ్యాక్స్ హౌస్, 1, డా. ఝువా మార్గ్, ఓఖ్లా, న్యూ ఢిల్లీ – 110 020 |
బి-14.01741 |
నవంబర్ 29, 2000 |
అక్టోబర్ 14, 2019 |
| 5. |
వీఏజీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
డి-42, బేస్మెంట్ సౌత్ ఎక్స్టెన్షన్, పార్ట్-I, న్యూ ఢిల్లీ – 110 049 |
బి.14.01928 |
సెప్టెంబర్ 01, 2000 |
అక్టోబర్ 17, 2019 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1190 |