నవంబర్ 19, 2019
ది కోణార్క్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, థానే,
మహారాష్ట్ర పై - జరిమానా విధింపు.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టo, 1949 సెక్షన్ 47ఏ(1)(బి)తోపాటు సెక్షన్ 46(4)(i) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు సంక్రమించిన అధికారాలతో ది కోణార్క్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, థానే, మహారాష్ట్ర పై, డైరెక్టర్ సంబంధిత రుణాల కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు సూచనలు / మార్గదర్శకాలను ఉల్లంఘించినందులకు, ₹ 4.00 లక్షల (నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించింది.
2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంక్ లిఖితపూర్వకంగా సమాధానం ఆ తరువాత మౌఖిక వినతులను కూడా సమర్పించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన నిజానిజాలు మరియు బ్యాంక్ ఇచ్చిన సమాధానo పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1218 |