తేదీ: 02/12/2019
రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949
(సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు
ఫిబ్రవరి 21, 2013 నాటి ఆదేశం UBD.CO.BSD-I/D-28/12.22.218/2012-13 ద్వారా రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే, ఫిబ్రవరి 22, 2013 పనివేళలు ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. అట్టి నిర్దేశాల కాలపరిమితిని తదుపరి ఆదేశాల ప్రకారం క్రమానుసారంగా పొడిగిస్తూ, చివరిగా ఆగష్టు 28, 2019 నాటి ఆదేశం DCBR.CO.AID./No,D-12/12.22.218/2019-20 ద్వారా నవంబర్ 30, 2019 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనది.
2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, ఫిబ్రవరి 21, 2013 నాటి ఆదేశం UBD.CO.BSD-I/D-28/12.22.218/2012-13 ద్వారా ఫిబ్రవరి 22, 2013 పనివేళలు ముగింపు నుండి రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణేఫై విధించిన నిర్దేశాల కాలపరిమితిని సమయానుసారంగా సవరిస్తూ చివరిగా నవంబర్ 30, 2019 వరకు సమీక్షకు లోబడి పొడిగించిన నిర్దేశాలను, నవంబర్ 20, 2019 నాటి ఆదేశం DOR.AID/D-40/12.22.218/2019-20 ద్వారా డిసెంబర్ 01, 2019 నుండి ఫిబ్రవరి 29, 2020 వరకు మరో మూడు నెలల కాలానికి చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా తెలియచేయడమైనది. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు.
3. నిర్దేశాల పొడిగింపును తెలిపే నవంబర్ 20, 2019 నాటి ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది.
4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1325 |