తేదీ: 31/01/2020
శివం సహకారీ బ్యాంక్ లిమిటెడ్, ఇచల్కారంజి, జిల్లా కొల్లాపూర్, మహారాష్ట్ర –
నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు
శివం సహకారీ బ్యాంక్ లిమిటెడ్, ఇచల్కారంజి, జిల్లా కొల్లాపూర్, మహారాష్ట్ర, మే 19, 2018 పనివేళలు ముగింపు నుండి భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా నిర్దేశాల క్రింద ఉంచబడింది. (మే 18, 2018 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-6/12.22.351/2017-18 ద్వారా).
2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, జనవరి 29, 2020 నాటి ఆదేశం DOR.CO.AID/D-50/12.22.351/2019-20 ద్వారా, పైన తెలిపిన విధంగా విధించిన నిర్దేశాలు, మార్చ్ 31, 2020 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా తెలియచేయడమైనది.
3. నిర్దేశాల పొడిగింపును తెలిపే పై ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది.
4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితి పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1852 |