మే 27, 2020
ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర కు
నిర్దేశాల జారీ - కాలపరిమితి పొడిగింపు
ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర , మే 19, 2018 తేదీ పనివేళల ముగింపు నుండి భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా నిర్దేశాల (డిసిబియస్.సిఓ.బియస్డి.I/డి-6/12.22.351/2017-18 మే 18, 2018 తేదీ నాటి ఆదేశం ద్వారా) క్రింద ఉంచబడింది.
2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56తో కలిపి, సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 ఎ క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని, మే 21, 2020 తారీఖు నాటి ఆదేశం డిఓఆర్.సిఓ.ఏఐడి/డి-81/12.22.351/2019-20 ద్వారా, పైన తెలిపిన విధంగా విధించిన నిర్దేశాలు జులై 31, 2020 తేదీ వరకు బ్యాంక్ కు చెల్లుబాటు అయ్యేలా సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా జనావళికి సమాచారం తెలియజేయడమైనది.
3. నిర్దేశాల పొడిగింపును తెలిపే పై ఆదేశం నకలు, ఆసక్తిగల ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది.
4. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశాల పొడిగింపు మరియు / లేదా సవరణ ను బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా యున్నదని అన్యధా పరిగణించరాదు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/2405 |