Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (150.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 31/08/2020
రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రకు జారీచేసిన ఆదేశాల గడువు పొడిగింపు

తేదీ: 31/08/2020

రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రకు జారీచేసిన ఆదేశాల గడువు పొడిగింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వారి ఆదేశాలు UBD.CO.BSD-I/D-28/12.22.218/2012-13 తేదీ ఫిబ్రవరి 21, 2013 ద్వారా), రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రను, ఫిబ్రవరి 22, 2013 తేదీ పని ముగింపు వేళనుండి నిర్దేశాల పరిధిలోకి తెచ్చినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరన ఆగస్ట్ 31, 2020 వరకు పొడిగించబడింది.

2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సబ్-సెక్షన్ (1) సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56తో సహా), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న ఆదేశాలు, నవంబర్ 30, 2020 వరకు బ్యాంకుకు వర్తిస్తాయని, DOR.CO.AID.No.D-15/12.22.218/2020-21, తేదీ ఆగస్ట్ 25, 2020 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించ వచ్చు.

3. కాలపరిమితి పెంచుతూ, జారీచేసిన ఆదేశాల ప్రతి, రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర, ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది.

4. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి గురించి రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/257

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….