Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (169.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 31/08/2020
సువ్యవస్థిత మార్కెట్ పరిస్థితులను పెంపొందించే చర్యలను ఆర్‌బిఐ ప్రకటించింది

ఆగస్ట్ 31, 2020

సువ్యవస్థిత మార్కెట్ పరిస్థితులను పెంపొందించే చర్యలను
ఆర్‌బిఐ ప్రకటించింది

ఆగష్టు 25, 2020 న స్పెషల్ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను ప్రకటించినప్పుడు, రిజర్వ్ బ్యాంకు పరిణమిస్తున్న ద్రవ్యత్వ మరియు మార్కెట్ పరిస్థితులను పర్యవేక్షించడం కొనసాగిస్తుందని మరియు ఆర్థిక మార్కెట్ల క్రమబద్ధమైన పనితీరును నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

2. ఇటీవల కాలంలో, ప్రపంచ పరిణామాల మధ్య ద్రవ్యోల్బణo దృక్పథానికి సంబంధించిన ఆందోళనలు మరియు విదేశాల్లో రాబడుల ఎదుగుదల ఇంకా ఫిస్కల్ పరిస్థితులపై మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైంది.

3. ద్రవ్యోల్బణం యొక్క దృష్టికోణం మీద, ఆగస్టు 6, 2020 న ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) తీర్మానం ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మూలాలను గుర్తించింది ఇంకా హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం క్వార్టర్ 2: 2020-21లో ఉధృతంగా ఉన్నప్పటికీ, ఇది హెచ్ 2: 2020-21 లో మితంగా ఉంటుందని అంచనా వేసింది. తదనుగుణంగా ఎంపిసి, వేచిచూచే ధోరణిని మరియు ఉన్న వనరులను జగరూకతో వాడుకుంటూ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవనానికి మద్దతుగా నిర్ణయించింది. ఆహారం మరియు ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయని మరియు ఖర్చును ఎగదోసే కారకాలు మందగించాయని సూచనలున్నాయి. అదనంగా, ఇటీవలి పెరిగిన రూపాయి దిగుమతౌతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కట్టడికి బాగా పనిచేస్తుంది. ఈ పరిణామాల నేపధ్యంలో, ఆర్బీఐ అప్రమత్తంగా ఉంది. ద్రవ్య విధానం యొక్క సర్దుబాటు వైఖరికి మద్దతుగా, ఆర్థిక వ్యవస్థలో తగినంతగా ద్రవ్యత మరియు ఫైనాన్సింగ్ పరిస్థితుల ఏర్పాటుకు ఆర్బిఐ కట్టుబడి ఉంది.

4. 2020-21 సంవత్సరానికి మార్కెట్ బారోయింగ్ ప్రోగ్రాం హెచ్చుగాఉన్నప్పటికీ, ఆర్బిఐ ఈ సంవత్సరం ప్రదమార్ధం వరకు బారోయింగ్ క్యాలెండర్‌ను సజావుగా నిర్వహించింది, H1: 2020-21 లో కేంద్రం మరియు రాష్ట్రాల షెడ్యూలయిన రుణాలు 90 శాతానికి పైగా పూర్తి చేసింది. 2020-21 సంవత్సారానికి కేంద్రం మరియు రాష్ట్రాల మార్కెట్ బారోయింగ్ ప్రోగ్రాంలు నిరాఘాటం గా పూర్తవుతాయని ఆర్బిఐ హామీ ఇచ్చింది.

5. క్రమమైన మార్కెట్ పరిస్థితులు మరియు అనుకూల ఆర్థిక పరిస్థితులు ఏర్పరచే దిశలో, ఈ క్రింది చర్యలు ప్రకటించబడుతున్నాయి:

(i) రిజర్వు బ్యాంకు అదనంగా, స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ను నిర్వహిస్తుంది, ఇందులో ఏకకాలంలో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాలతో కలిపి మొత్తంగా 20,000 కోట్ల రూపాయలకు, ఒక్కో విడతలో 10,000 కోట్లు చొప్పున రెండు విడతలగా నిర్వహిస్తుంది. ఈ వేలం లు సెప్టెంబర్ 10, 2020 మరియు సెప్టెంబర్ 17, 2020 న నిర్వహించబడతాయి. మార్కెట్ పరిస్థితుల అవసరం మేరకు మరిన్ని కార్యకలాపాలను నిర్వహించడానికి ఆర్బిఐ కట్టుబడి ఉంది

(ii) మార్కెట్లో ముందస్తు పన్నుచెల్లింపుల మూలంగా ఏర్పడిన ఒత్తిడిని తట్టుకోవడానికి, రిజర్వు బ్యాంకు సెప్టెంబర్ నెల మధ్యలో ఫ్లోటింగ్ రేట్ల వద్ద (అంటే, ప్రస్తుత రెపో రేటు వద్ద) మొత్తం, 100,000 కోట్ల టర్మ్ రెపో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. నిధుల సమీకరణ వ్యయాన్నితగ్గించుకోవడానికి, దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ల (ఎల్‌టిఆర్‌ఓ) కింద నిధులను పొందిన బ్యాంకులు మెచూరిటి కి ముందుగనే ట్రాన్సాక్షన్ ను రివర్స్ చేసే ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా, అప్పటి రెపో రేటు వద్ద తీసుకున్న నిధులను (5.15 శాతం) తిరిగి ఇవ్వడం ద్వారా మరియు ప్రస్తుత రెపో రేటు 4 శాతం వద్ద నిధులను పొందడం ద్వారా బ్యాంకులు తమ వడ్డీ ఖర్చులను తగ్గించుకోవచ్చు. వివరాలు విడిగా తెలియజేయబడతాయి.

(iii) ప్రస్తుతం, బ్యాంకులు తమ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీలను (ఎన్‌డిటిఎల్), 18 శాతం ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలలో ఉంచవలసిన అగత్యం ఉంది. హెచ్‌టిఎం కేటగిరీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రస్తుతం ఉన్న పరిమితి మొత్తం పెట్టుబడిలో 25 శాతం గ వుంది. ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలలో ఈ పరిమితిని మించి, అంటే బ్యాంకులు తమ ఎన్‌డిటిఎల్ లో 19.5 శాతం మొత్తానికి మించకుండా, పెట్టుబడికి అనుమతించబడతాయి. పెద్ద బ్యాంకుల వద్ద హెచ్‌టిఎం కేటగిరీలో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలు ప్రస్తుతం మొత్తం ఎన్‌డిటిఎల్‌లో 17.3 శాతం ఉన్నాయి. అయితే బ్యాంకుల మధ్య వ్యత్యాసం వుంది, ఇది దగ్గర దగ్గర కొన్ని బ్యాంకులకు ఎన్‌డిటిఎల్‌లో 19.5 శాతం వరకు ఉన్నది. అందువల్ల, సెప్టెంబర్ 01, 2020 నుండి హెచ్‌టిఎమ్ కు తెచ్చుకున్న ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలలో తాజా సేకరణను మార్చి 31, 2021 వరకు బ్యాంకులమొత్తం ఎన్‌డిటిఎల్‌ లో 22 శాతం పరిమితి వరకు బ్యాంకులను అనుమతించాలని నిర్ణయించారు. వివరాలు విడిగా తెలియజేయబడతాయి.

(iv) మార్కెట్ల పనితీరు సక్రమంగా ఉండేందుకై వైవిధ్యం గల ఇన్స్ట్రుమెంట్స్ తో మార్కెట్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఆర్బిఐ సిద్ధంగా ఉంది.

6. ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వం మరియు పటుత్వం ను కాపాడుతూనే, అనుకూల ఆర్ధిక వాతావరణం ను ఏర్పరచడం, COVID-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడం ఇంకా స్థిరమైన వృద్ధి దిశలో ఆర్ధిక వ్యవస్థను తిరిగి మళ్ళించడం ద్వారా ఆర్థికవ్యవస్థను గాడిలోపెట్టడానికి ఆర్బిఐ తన అమ్ములపొదినుంచి సర్వ శక్తులను ఉపయోగించడానికై, కట్టుబడి ఉంది.

(యోగేశ్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/263

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….