ఫిబ్రవరి 05, 2021
అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన
ఈ ప్రకటన, (i) ద్రవ్య నిర్వహణ మరియు లక్షిత రంగాలకు మద్దతు; (ii) నియంత్రణ మరియు పర్యవేక్షణ (iii) ఆర్థిక మార్కెట్లను విస్తృతపరచడం (iv) చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలను నవీకరణ చేయడం మరియు (v) వినియోగదారుల భద్రత పై వివిధ అభివృద్ధి మరియు నియంత్రణ విధాన చర్యలను నిర్దేశిస్తుంది
I. ద్రవ్య సంబంధిత చర్యలు
1. టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం – NBFCలను చేర్చడం
బాహుళ్యవ్యాప్తి మరియు గుణక ప్రభావంతో వృద్ధిని ప్రేరేపించే నిర్దిష్ట రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించే ద్రవ్య సంబంధిత చర్యల దృష్టిని పెంచే ఉద్దేశంతో, అక్టోబర్ 9, 2020 న ఆర్‌బిఐ టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత-దీర్ఘకాల (ఆన్ ట్యాప్) స్కీమ్‌ను ప్రకటించింది, ఇది మార్చి 31, 2021 వరకు లభిస్తుంది. అక్టోబర్ 21, 2020 న ఈ పథకం కింద ప్రకటించిన ఐదు రంగాలతో పాటు, కామత్ కమిటీ గుర్తించిన 26 ఒత్తిడికి లోనైన రంగాలను కూడా డిసెంబర్ 04, 2020 న టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్)క్రింద అర్హతగల రంగాల పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ పథకం క్రింద లభ్యమైన ద్రవ్యాన్ని బ్యాంకులు ఈ రంగాలలోని సంస్థలు జారీ చేసే కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు మరియు నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లలో ఉంచాలి. ఈ రంగాలకు బ్యాంకు రుణాలు మరియు అడ్వాన్సులను అందించడానికి కూడా ఈ పథకం క్రింద లభించే లిక్విడిటీని ఉపయోగించవచ్చు. ఈ సదుపాయం క్రింద బ్యాంకులు పెట్టిన పెట్టుబడులు హెల్డ్-టు-మెచ్యూరిటీ (హెచ్‌టిఎమ్-HTM) పోర్ట్‌ఫోలియో క్రింద వర్గీకరించుకోవచ్చు; అవి హెచ్‌టిఎమ్ పోర్ట్‌ఫోలియోలో అనుమతించబడిన మొత్తం పెట్టుబడిలో 25 శాతo పైబదినప్పటికీ. ఈ సదుపాయం క్రింద ఉన్న అన్ని ఎక్స్పోజర్లు, లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్‌వర్క్ (LEF) క్రింద లెక్కించకుండా మినహాయించబడతాయి.
తుది మజిలి వరకు అరువు అందించే విషయంలోను మరియు వివిధ రంగాలకు తగినంతగా అరువు విస్తారణ చేయగల బలిష్ఠమైన గుణకాలుగా ఎన్‌బిఎఫ్‌సిలు బాగా పేరొందినందున, ఈ రంగాలకు అదనoగా రుణాలుఇచ్చేందుకు టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం క్రింద ఎన్‌బిఎఫ్‌సిలకు నిధులు సమకూర్చాలని ప్రతిపాదించబడింది.
2. మార్చి 2021 నుండి రెండు దశల్లో నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్) పునరుద్ధరణ
కోవిడ్-19 వల్ల కలిగిన మార్పుల ఆటుపోట్లనుండి తట్టుకోవడానికి బ్యాంకులకు మద్దతిచ్చేందుకు అన్ని బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్), మార్చి 28, 2020 తో మొదలయ్యే రిపోర్టింగ్ పక్షం నుండి 100 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో సిఆర్ఆర్ నెట్ డిమాండ్ & టైం లయబిలిటీలో (ఎన్‌డిటిఎల్) 3.00 శాతం కు తగ్గించబడింది. ఈ వెసులుబాటు ఒక సంవత్సరం పాటు మార్చి 26, 2021 తుది వరకు లభిస్తుంది. ద్రవ్య మరియు ద్రవ్యత్వ పరిస్తితుల సమీక్షలో, సిఆర్ఆర్ ను రెండు దశలలో అంతరాయం కలిగించని రీతిలో పునరుద్ధరించాలని నిర్ణయించారు. బ్యాంకులు ఇప్పుడు సిఆర్ఆర్ ను మార్చి 27, 2021 తో మొదలయ్యే రిపోర్టింగ్ పక్షం నుండి ఎన్‌డిటిఎల్ లో 3.5 శాతం వద్ద మరియు మే 22, 2021 తో మొదలయ్యే రిపోర్టింగ్ పక్షం నుండి 4.00 శాతం వద్ద నిర్వహించాల్సి ఉంటుంది.
3. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) – సడలింపుల యొక్క పొడిగింపు
పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ- ఎంఎస్ఎఫ్) క్రింద నిధులను పొందడానికి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (యస్ యల్ ఆర్-SLR) నిదులలోంచి ఎన్‌డిటిఎల్ (Net Demand and Time Liabilities) అదనంగా ఒక శాతం వరకు, అంటే మొత్తం యన్డిటియల్ లో మూడు (3) శాతం వరకు నిధులను వినియోగించుకోవడానికి మార్చి 27, 2020 న బ్యాంకులు అనుమతించబడినవి. ప్రారంభంలో జూన్ 30, 2020 వరకు లభించిన ఈ సౌకర్యం, తరువాత మార్చి 31, 2021 వరకు దశలవారీగా పొడిగించబడింది. ఈ సడలింపు బ్యాంకులకు వారి ద్రవ్యత్వ అవసరాలు తీర్చడానికి మరియు లిక్విడిటీ కవేరేజ్ రేషియో (యల్ సీ ఆర్ – LCR) ను చేరుకోడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఈ సౌకర్యం ` 1.53 లక్షలకోట్ల మేరకు నిధులు అందుబాటులో ఉంచడమే గాకుండా లిక్విడిటీ కవేరేజ్ రేషియో (యల్ సీ ఆర్ – LCR) కోసం ఉన్నత-శ్రేణి ద్రవ్య ఆస్తులు (హెచ్ క్యూ యల్ ఎ – HQLA) గా అర్హత పొందుతుంది. బ్యాంకులు యల్ సీ ఆర్ – LCR ను చేరుకోవాలనే అవసరం కొనసాగింపుకు వీలుగా, ఇంకా వారికి ద్రవ్య లభ్యత అందించే ఉద్దేశ్యం తో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF సడలింపును మరో ఆరు మాసాల పాటు అనగా సెప్టెంబర్ 30, 2021 వరకు కొనసాగించాలని నిర్ణయించడమైనది.
II. నియంత్రణ మరియు పర్యవేక్షణ
4. హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎం-HTM) విభాగంలో చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్-SLR) హోల్డింగ్స్
సెప్టెంబర్ 1, 2020 న రిజర్వు బ్యాంకు, సెప్టెంబర్ 1, 2020 న లేదా ఆ తర్వాత మార్చి 31, 2021 వరకు సమకూర్చుకున్న ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలకు సంబంధించి హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎమ్) వర్గం క్రింద పరిమితిని ఎన్‌డిటిఎల్ లో 19.5 శాతం నుండి 22 శాతానికి పెంచింది. ఈ వెసులుబాటు మార్చి 31, 2022 వరకు లభిస్తుంది. 2021-22 సంవత్సరానికి కేంద్రం మరియు రాష్ట్రాల రుణ సమీకరణ నేపధ్యంలో మార్కెట్ మదుపర్లకు ఖచ్చితత్వాన్ని తెలియచేయడానికి, ఏప్రిల్ 1, 2021 మరియు మార్చి 31, 2022 మధ్య సమకూర్చుకున్న సెక్యూరిటీల కోసం 22 శాతంగా పెంచిన హెచ్‌టిఎమ్ లిమిట్ సదుపాయాన్ని మార్చి 31, 2023 వరకు పొడిగించాలని నిర్ణయం చేయబడింది.
జూన్ 30, 2023 తో ముగిసే త్రైమాసికం నుండి, దశలవారీగా హెచ్‌టిఎమ్ పరిమితి 22 శాతం నుండి 19.5 శాతానికి పునరుద్ధరించబడుతుంది. HTM లిమిట్ ని నిమ్మళింపు పధంలో పూర్వపు స్థాయి కి చేరడం కోసం, బ్యాంకులు SLR సెక్యూరిటీలో పెట్టుబడి కి ప్లాన్ చేస్తాయని భావిస్తున్నారు.
5. MSME పారిశ్రామికవేత్తలకు ఋణాలు
సూక్ష్మ, లఘు మరియు మధ్యస్థ వ్యవస్థాపక (ఎంఎస్‌ఎంఇ) రుణగ్రహీతలకు’ కొత్తగా ఋణాలను అందించడం ను ప్రోత్సహించడానికి, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తమ ఎన్‌డిటిఎల్ నుండి ‘కొత్త ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతలకు’ పంపిణీ చేసిన ఋణాలను నగదు రిజర్వ్ నిష్పత్తి (సిఆర్ఆర్) లెక్కింపు నుండి తగ్గించుకోవడానికి అనుమతించబడతాయి. ఈ మినహాయింపు పొందడానికి, ‘జనవరి 1, 2021 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఎటువంటి రుణ సదుపాయాలను పొందని MSME రుణగ్రహీతలు ‘కొత్త MSME రుణగ్రహీతలు’ గా నిర్వచించబడతారు. ఈ మినహాయింపు అక్టోబర్ 01, 2021 తో ముగిసే పక్షం వరకు రుణగ్రహీతకు 25 లక్షల వరకు ఎక్స్‌పోజర్‌లకు రుణం మొదలైన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు లేక రుణం యొక్క గడువు, రెంటిలో ఏది త్వరగా ముగుస్తుందో, దానివరకు మాత్రమే లభిస్తుంది.
6. బాసెల్ III మూలధన నియంత్రణలు (క్యాపిటల్ రెగ్యులేషన్స్) - పూర్తి స్థాయిలో మూలధన పరిరక్షణ బఫర్ (సిసిబి) వాయిదా
కోవిడ్-19 నేపధ్యంలో చేపట్టిన నియంత్రణ చర్యలలో భాగంగా ఏప్రిల్ 1, 2020న అమల్లోకి రావాల్సిన మూలధన పరిరక్షణ బఫర్ (సిసిబి) యొక్క 0.625 శాతం చివరి విడత అమలు ఏప్రిల్ 01, 2021 వరకు వాయిదాపడింది. అయితే కోవిడ్ 19 మూలంగా కొనసాగుతున్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకొని ఇంకా రికవరీ ప్రక్రియలో సహాయపడటానికి, సిసిబి యొక్క 0.625 శాతం చివరి విడత అమలును ఇప్పుడు ఏప్రిల్ 01, 2021 నుండి అక్టోబర్ 01, 2021 వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు.
7. నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్) (నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో (NSFR) అమలు వాయిదా
కోవిడ్-19 నేపధ్యంలో చేపట్టిన నియంత్రణ చర్యలలో భాగంగా భారతదేశంలోని బ్యాంకులచే ఏప్రిల్ 1, 2020న అమల్లోకి రావాల్సిన నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో (NSFR) అమలు ఏప్రిల్ 01, 2021 వరకు వాయిదాపడింది. బ్యాంకులకు లిక్విడిటీ పరంగా ఇబ్బందులేమీ లేనప్పటికీ కోవిడ్-19 కారణంగా కొనసాగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఎన్‌ఎస్‌ఎఫ్‌ఆర్ అమలును అక్టోబర్ 01, 2021 వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు.
8. మైక్రోఫైనాన్స్ మీద నియంత్రణ చట్రం (రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్) యొక్క సమీక్ష
ఇటీవల, రిజర్వు బ్యాంకు ఎన్‌బిఎఫ్‌సిల మీద, “సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ - స్కేల్ బేస్డ్ అప్రోచ్” అనే ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఆర్ధిక రంగంలో నిరంతరం జరుగుతున్నమార్పులను పరిగణనలోకి తీసుకొని, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఎన్‌బిఎఫ్‌సి-ఎంఎఫ్‌ఐ) మీద ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షించాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది. ఎన్‌బిఎఫ్‌సి-ఎంఎఫ్‌ఐలు ఒక్కింటికే మార్గదర్శకాలను సూచించకుండా, మైక్రోఫైనాన్స్ జాగాకు సంబంధించి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, చిన్న ఋణాల బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సి-ఇన్వెస్ట్మెంట్ మరియు క్రెడిట్ కంపెనీలతో సహా అన్ని నియంత్రిత అరువిచ్చు సంస్థలకు ఒకే విధంగా వర్తించే ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలనే వొక విషయం గమనించాలి. దీని ప్రకారం, మైక్రోఫైనాన్స్ జాగాకు సంబంధించి వివిధ నియంత్రిత అరువిచ్చు సంస్థల మీద ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లను సమన్వయపరస్తూ ఆర్‌బిఐ త్వరలో ఒక సంప్రదింపుల పత్రం ను తెస్తున్నారు.
9. ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకుల మీద నిపుణుల కమిటీ ఏర్పాటు
ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులు పరపతి నిర్మాణక్రమం లో మహత్వపూర్వమైన పాత్ర పోషిస్తున్నాయి. జూన్ 26, 2020 నుండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 యొక్క నిబంధనలు ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. ఈ సవరణలు యుసిబిలు మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య నియంత్రణ మరియు పర్యవేక్షక అధికారాలను; పాలన, ఆడిట్ మరియు నిర్ణయాల కు సంబంధించిన వాటిని కలుపుకుని, దగ్గర దగ్గర సమం చేశాయి. పర్యవసానంగా, ఈ సవరణల నేపధ్యంలో ఈ రంగం పట్ల నియంత్రణ / పర్యవేక్షక విధానం మీద సమగ్రమైన వొక సమీక్ష అవసరం. అందువల్ల, ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి భాగస్వాములందరి కూడికతో వొక మధ్య కాలిక మార్గ సూచీ (రోడ్ మ్యాప్) ను పొందేందుకు నిపుణుల కమిటీని వేయాలని నిర్ణయించారు, తద్వారా యుసిబిల పునర్నిర్మాణం పటిష్టం మరియు వేగవంతం కావడానికి అదేవిధంగా యుసిబిల క్లిష్టమైన సమస్యలు పరిశీలించ డానికి సాధ్యం అవుతుంది. కమిటీ ఏర్పాటుతో పాటు పరిశీలన అంశాలు విడిగా తెలియజేయబడతాయి.
10. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలకు (ఐఎఫ్‌ఎస్‌సి) చెల్లింపులు
వర్తమానం లో, నివాసిత వ్యక్తులు (రెసిడెంట్ వ్యక్తులు) లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతదేశంలో స్థాపించబడిన ఐఎఫ్‌ఎస్‌సిలకు చెల్లింపులు చేయడానికి అనుమతి లేదు. ఐఎఫ్‌ఎస్‌సిల లోని ఫైనాన్షియల్ మార్కెట్లను విస్తృతపరచేందుకు మరియు నివాసితులకు వారి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరిచే అవకాశాన్ని కల్పించడానికి, వొక సమీక్షలో, ఈ ఎల్ఆర్ఎస్ కింద భారతదేశంలో స్థాపించబడిన ఐఎఫ్‌ఎస్‌సిలకు చెల్లింపులు చేయడానికి నివాసితులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రయాణానికి, చదువుకోవడం, బహుమతులు పంపడం లాంటి కరెంట్ అకౌంట్ లావాదేవీలకు, మరియు స్థిర ఆస్తి కొనుగోలు చేయడం వంటి మూలధన ఖాతా లావాదేవీలకు చేయు చెల్లింపులు భారతదేశంలోని ఐఎఫ్‌ఎస్‌సిలకు సంబంధించి ప్రస్తుతంకావు కాబట్టి, ఐఎఫ్‌ఎస్‌సిలలో (IFSCలలో) ప్రవాస సంస్థలు జారీ చేసిన సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే చెల్లింపులు అనుమతించబడతాయి. ఎల్‌ఆర్‌ఎస్ కింద పెట్టుబడులు పెట్టడానికి రెసిడెంట్ వ్యక్తులు ఐఎఫ్‌ఎస్‌సిలలో వడ్డీ లేని విదేశీ కరెన్సీ ఖాతా (ఎఫ్‌సిఎ) ను కూడా తెరవవచ్చు. FCA లోని నిధులను IFSCలలో అనుమతించదగిన పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. వాడకుండా ఉన్న నిధులను అవి జమఅయిన 15 రోజుల వ్యవధిలోపున భారతదేశంలో పెట్టుబడిదారుడి నివాస ఖాతాకు తిరిగి తీసుకు రావాల్సిన అగత్యం ఉంది. AP DIR సర్క్యులర్ రూపంలో వివరణాత్మక మార్గదర్శకాలు త్వరలో జారీ చేయబడతాయి.
III. ఆర్థిక మార్కెట్లను (ఫైనాన్షియల్ మార్కెట్లను) విస్తృతపరచడం
11. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లో రిటైల్ భాగస్వామ్యాన్నిమరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం మరియు ఆర్బిఐ దృష్టిని పెట్టాయి. తదనుగుణంగా, ప్రైమరీ ఆక్షన్ లో నాన్-కాంపిటీటివ్ బిడ్డింగ్ ను ప్రవేశపెట్టడం, రిటైల్ పెట్టుబడిదారులకు అగ్రిగేటర్లు / ఫెసిలిటేటర్లుగా పనిచేయడానికి స్టాక్ ఎక్స్ఛేంజీలను అనుమతించడం మరియు NDS-OM సెకండరీ మార్కెట్లో ఆడ్-లాట్ సెగ్మెంట్ ను అనుమతించడం వంటివి, గతంలో తీసుకోబడ్డాయి. ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ భాగస్వామ్యాన్ని విస్తృత పరచడానికి మరియు ప్రాప్యత (యాక్సెస్) సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి నిరంతర ప్రయత్నాల్లో భాగంగా అగ్రిగేటర్ మోడల్ కు మించి చిన్న మదుపర్లకు ఆర్‌బిఐ వద్ద ఒక గిల్ట్ సెక్యూరిటీస్ ఖాతా (గిల్ట్ అకౌంట్) (రిటైల్ డైరెక్ట్) ను తెరిచే సదుపాయం తో సహా, ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్ లో – ప్రైమరీ మరియు సెకండరీ రెండింటిలో - ఆన్‌లైన్ ప్రాప్యతను ఇవ్వాలని, ఇప్పుడు నిర్ణయించబడింది. ఫెసిలిటీ సంబంధిత వివరాలు విడిగా జారీ చేయబడతాయి.
12. డిఫాల్టెడ్ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు –
ప్రస్తుతం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) దివాలా కోడ్, 2016 (Insolvency and Bankruptcy Code, 2016) క్రింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ ప్రకారం, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద ఒక సంస్థ జారీ చేసిన డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో మరియు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీ రిసీట్లు మరియు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోను పెట్టుబడి పెట్టవచ్చు; మరియు ఈ పెట్టుబడులు FPI లచే కార్పొరేట్ బాండ్లలో మీడియం టర్మ్ ఫ్రేంవర్క్ (MTF) పెట్టుబడుల క్రింద షార్ట్ టర్మ్ లిమిట్ మరియు మినిమమ్ రెసిడ్యుయల్ మెచూరిటి రిక్వైర్మెంట్ నుండి మినహాయించబడతాయి. కార్పొరేట్ బాండ్లలో FPI ల పెట్టుబడులను ఇంకా ప్రోత్సహించేందుకు, డిఫాల్టెడ్ కార్పొరేట్ బాండ్లకు ఇలాంటి మినహాయింపులను విస్తరించాలని ప్రతిపాదించబడింది. దీని ప్రకారం, డిఫాల్టెడ్ కార్పొరేట్ బాండ్లలో ఎఫ్‌పిఐ పెట్టుబడి MTF పెట్టుబడుల క్రింద షార్ట్ టర్మ్ లిమిట్ మరియు మినిమమ్ రెసిడ్యుయల్ మెచూరిటి రిక్వైర్మెంట్ నుండి మినహాయించబడుతుంది. వివరణాత్మక మార్గదర్శకాలు విడిగా జారీ చేయబడుతున్నాయి.
IV. చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు (పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్)
13. డిజిటల్ చెల్లింపు సేవల కోసం 24 x 7 సేవా కేంద్రం (హెల్ప్‌లైన్) ఏర్పాటు
వినియోగదారులకు మెరుగైన డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం కోసం భారతీయ రిజర్వు బ్యాంకు ఫిర్యాదుల పరిష్కారo దిశలో భద్రత మరియు భద్రతా అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. వివిధ డిజిటల్ చెల్లింపు ఉత్పత్తులకు సంబంధించి కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడానికి 24x7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని ఆర్‌బిఐ యొక్క చెల్లింపు వ్యవస్థ విజన్ పత్రం సంకల్పించింది. హెల్ప్‌లైన్ డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులకు మరింత నమ్మకం పెంచేందుకు తోడ్పడుతుంది, ఇంకా ఆర్థిక మరియు మానవవనరులపై ఖర్చును కూడా తగ్గిస్తుంది; అన్యథా ఖర్చుతప్పదు కొర్రీస్ మరియు ఫిర్యాదులను పరిష్కరించడానికి. వివిధ డిజిటల్ చెల్లింపు ఉత్పత్తులకు సంబంధించి కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడానికి ఇండస్ట్రీ-వ్యాప్తంగా కేంద్రీకృత 24x7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడానికి మరియు సెప్టెంబర్ 2021 నాటికి అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార విధానాలపై సమాచారం ఇవ్వడానికి ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో, హెల్ప్‌లైన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులను నమోదు చేసి పరిష్కరించే సౌకర్యం గురించి తప్పకుండా ఆలోచించాలి.
14. అధీకృత చెల్లింపు వ్యవస్థల భాగస్వాములు మరియు ఆపరేటర్లకు పొరుగు సేవలపై (అవుట్‌సోర్సింగ్) మార్గదర్శకాలు
వివిధ అధీకృత చెల్లింపు వ్యవస్థల యొక్క భాగస్వాములు మరియు ఆపరేటర్లు, వారు అందించే ఉత్పత్తుల కారణంగా మరియు వారు నడిపే చెల్లింపు వ్యవస్థల డిజైన్ మూలంగా, ప్రత్యేకమైన కార్యకలాపాలు అనేకం నిర్వహిస్తారు. తరచూ, ఖర్చులను తగ్గించుకుంటూ ప్రతిభను ఇనుమడింప చేసుకునేందుకు కొన్ని వ్యవహారాలను పొరుగుసేవలకు ఇస్తుంటారు. ఏదేమైనా, అటువంటి పొరుగు సేవలను అందించే సంస్థల వ్యవస్థలోని దుర్బలత్వం ప్రధాన సంస్థకు సైబర్ భద్రతా ప్రమాదాలను కలిగిస్తుంది. పోరుగుసేవల కూడా ఉండే రిస్కులను తట్టుకోవడానికి మరియు సెటిల్మెంట్ సంబంధిత సేవలను అవుట్‌సోర్సింగ్ చేసేటప్పుడు ప్రవర్తనా నియమావళి కట్టుబడి ఉందని నిర్ధారించుకోవడానికి, రిజర్వు బ్యాంకు అధీకృత చెల్లింపు వ్యవస్థల్లో భాగస్వాములు మరియు ఆపరేటర్లకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
15. CTS క్లియరింగ్‌లో దేశంలోని అన్ని బ్యాంక్ శాఖలు త్వరలో పాల్గొంటాయి
2010 నుంచి ఇప్పటి వరకు 1,50,000 శాఖలను సీటిఎస్ (చెక్ ట్రంకేషన్ సిస్టం) పరిధిలోకి తీసుకొచ్చి, మూడు చెక్ ప్రాసెసింగ్ గ్రిడ్ లను ఏర్పాటు చేశారు. సీటిఎస్ కు మునుపటి 1219 నాన్-సిటిఎస్ క్లియరింగ్ హౌస్ లు అన్నింటి తరలింపు జరిగింది. సుమారు 18,000 బ్యాంక్ శాఖలు ఇప్పటికీ అధికారిక క్లియరింగ్ ఏర్పాట్ల వెలుపల ఉన్నాయని గమనించాలి. వీటిని కాగితపు రహిత చెల్లింపుల విధానంలోకి, సెప్టెంబర్ 2021 లోపు తీసుకురావాలి. దీనివల్ల చెక్కు లావాదేవీలు మరింత వేగంగానూ మరియు వినియోగదారులకు సేవలు మెరుగవుతాయి. ఇందుకు మార్గదర్శకాలు ఒక నెల రోజుల్లో విడుదల చేయబడతాయి.
V. వినియోగదారుల భద్రత (కన్స్యూమర్ ప్రొటెక్షన్)
16. సమీకృత అంబుడ్స్ మన్ పధకం (ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీం)
విత్తీయ వినియోగదారు భద్రతా విషయం అధికార పరిధి అంతటా విధాన నిర్ణయాలలో ప్రధాన భూమిక వహిస్తుంది. వినియోగదారుల భద్రతపై ప్రపంచ పోకడలకు అనుగుణంగా, నియంత్రిత సంస్థల యొక్క ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఆర్బిఐ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం క్రింద బ్యాంకింగ్, బ్యాంకిన్గేతర ఆర్ధిక కంపెనీలు, డిజిటల్ లావాదేవీల్లో వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి విడివిడిగా మూడు పధకాలు (i) బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకం (ii) బ్యాంకిన్గేతర ఆర్థిక సంస్థల కోసం అంబుడ్స్‌మన్ పథకం మరియు (iii) డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్‌మన్ పథకం దేశమంతటా RBI యొక్క 22 అంబుడ్స్‌మన్ కార్యాలయాల నుండి అమలులో ఉన్నాయి. నియంత్రిత సంస్థలచే సంతృప్తికరంగా పరిష్కరించబడని, వినియోగదారు ఫిర్యాదులు కోసం ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి ఆర్‌బిఐ, “ఒకే-చోట పరిష్కరించడం” పేరున ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ (సిఎంఎస్) పోర్టల్‌ను నిర్వహిస్తున్నది. నియంత్రిత సంస్థల వినియోగదారులకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని మరింత సరళంగా మరియు మరింత ప్రతిస్పందించేలా చేయడానికి, ఉన్నమూడు అంబుడ్స్‌మన్ పథకాలను ఏకీకృతం చేసి ఫిర్యాదుల పరిష్కారానికి ‘ఒకే దేశం – ఒకే అంబుడ్స్‌మన్’ (‘వన్ నేషన్ - వన్ అంబుడ్స్‌మన్’) విధానాన్ని అమలుపరచాలని ఇప్పుడు నిర్ణయించబడింది. బ్యాంకుల, ఎన్‌బిఎఫ్‌సిల మరియు పిపిఐలను జారీచేసే బ్యాంకేతర సంస్థల కస్టమర్లు తమ ఫిర్యాదుల పరిష్కారానికై ఇంటిగ్రేటెడ్ స్కీమ్ కింద కేంద్రీకృతమైన ఒకే రిఫరెన్స్ పాయింట్‌వద్ద తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడం ద్వారా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఈ పధకం ఉద్దేశించబడింది. ఈ ఏడాది జూన్ కల్లా (జూన్ 2021) ఈ ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీం’ తీసుకురావాలని లక్ష్యం గా పెట్టబడింది.
(యోగేశ్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2020-2021/1051 |