తేదీ: 02/11/2020
మార్కెట్ వ్యాపార వేళలు పెంచిన రిజర్వ్ బ్యాంక్
కోవిడ్ 19 కారణంగా కలిగిన అంతరాయాలు, ఆరోగ్య భయాలు దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్, వారి నియంత్రణలోగల వివిధ మార్కెట్ల వ్యాపార సమయాలు ఏప్రిల్ 7, 2020 తేదీనుండి సవరించింది.
‘లాక్ డౌన్’ అంచలంచెలుగా ఎత్తివేయడం, ప్రజల కదలికలపై, కార్యాలయాలు పనిచేయడంపై విధించిన ఆంక్షలు క్రమేపీ సడలించిన కారణంగా, తమ నియంత్రణలోగల కార్యాలయాల వ్యాపార వేళలు దశలవారీగా పునరుద్ధరించవలెనని నిర్ణయించడం జరిగింది. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలోఉన్న మార్కెట్ల వ్యాపార వేళలు, నవంబర్ 9, 2020 నుండి ఈక్రిందివిధంగా ఉంటాయి
| మార్కెట్ |
గత సవరణ అనుసరంగా పనివేళలు |
సవరించబడిన, ప్రస్తుత పనివేళలు |
| కాల్ / నోటీస్ / టర్మ్ మనీ |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 3.30 ని. |
| ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ ‘రెపో’ |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 2.30 ని. |
| ప్రభుత్వ సెక్యూరిటీల త్రిపక్షీయ మార్కెట్ ‘రెపో’ |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 3 |
| కమర్షియల్ పేపర్ మరియు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 3.30 ని. |
| కార్పొరేట్ బాండ్లలో రెపో |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 3.30 ని. |
| ప్రభుత్వ సెక్యూరిటీలు (కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర వికాస రుణాలు మరియు ట్రెషరీ బిల్స్) |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 3.30 ని. |
| ఫారెక్స్ డిరైవేటివ్లతోసహా, ఫారిన్ కరెన్సీ (ఎఫ్ సి వై) / ఇండియన్ రుపీ (ఐ ఎన్ ఆర్) వ్యాపారాలు* |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 3.30 ని. |
| రుపీ వడ్డీ రేట్ డిరైవేటివ్లు* |
ఉ. 10 నుండి మ. 2 |
ఉ. 10 నుండి మ. 3.30 ని. |
| * గుర్తించబడ్డ స్టాక్ ఎక్స్చేంజిలలో ట్రేడ్ చేయబడనివి |
(యోగేశ్ దయాల్)
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2020-2021/577 |