తేదీ: ఏప్రిల్ 23, 2021
రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల కు కేంద్రo
యొక్క చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు -
డబ్ల్యూఎంఏ) పధకం పై సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు (డబ్ల్యూఎంఏ) – 2021 సలహా కమిటీ (ఛైర్మన్: శ్రీ సుధీర్ శ్రీవాస్తవ) వారి సిఫారసుల ఆధారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల (యుటి లు) డబ్ల్యుఎంఏ పథకాన్ని ఈ క్రింది విధంగా సవరించింది:
డబ్ల్యూఎంఏ పరిమితి (లిమిట్)
రాష్ట్రాలు / యుటిల మొత్తం వ్యయం ఆధారంగా వారి డబ్ల్యుఎంఏ పరిమితిని ₹47,010 కోట్లు గా కమిటీ తేల్చిచెప్పింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ఇంకా ప్రబలంగా ఉన్నందున, అన్ని రాష్ట్రాలు / యుటి లకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర డబ్ల్యుఎంఏ పరిమితి, ₹ 51,560 కోట్లు ఆరు మాసాలపాటు కొనసాగుతుంది, అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు (రాష్ట్ర / యుటి వారీగా డబ్ల్యుఎంఏ పరిమితులు ఇవ్వబడ్డాయి అనుబంధంలో). మహమ్మారి యొక్క రూపాంతరం మరియు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని బట్టి రిజర్వు బ్యాంకు తదనంతరం ఈ డబ్ల్యుఎంఏ పరిమితిని సమీక్షిస్తుంది.
స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్)
రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిల ఎస్‌డిఎఫ్ వాడుకోవడం అనేది భారత ప్రభుత్వం జారీ చేసిన మార్కెట్ సెక్యూరిటీలలో ఆక్షన్ ట్రెజరీ బిల్లులతో (ఎటిబి) సహా, వారి వారి పెట్టుబడుల పరిమాణంతో ముడిపడి ఉంటుంది. సాలుసరి CSF మరియు GRF లలో పెట్టుబడులలో నికర వృద్ధి ఎటువంటి పరిమితి లేకుండా, SDF పొందటానికి అర్హతను కలిగిఉంటుంది. ఎస్డిఎఫ్ క్రింద ఆపరేటింగ్ పరిమితి రోజువారీ నిర్ణయించడానికి, సెక్యూరిటీల మార్కెట్ విలువపై ఏకరీతి 5 శాతం హెయిర్-కట్ వర్తిస్తుంది.
ఓవర్‌డ్రాఫ్ట్ (OD) నిబంధనలు
మార్చి 31, 2021 వరకు, OD పై మధ్యంతర సడలింపులు1 అమలులో ఉన్నాయి. తదనంతరం, రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిల కు ఇపుడున్నOD నిబంధనలు అమలులో ఉన్నాయి.
SDF, WMA మరియు OD పై వడ్డీ రేటు
SDF, WMA మరియు OD పై వడ్డీ రేటు రిజర్వు బ్యాంకు పాలసీ రేటు అంటే, రెపో రేటు తో అనుసంధానించబడి ఉంటుంది. అడ్వాన్స్, బాకీ ఉన్న అన్ని రోజులకు వడ్డీ వసూలు చేయబడుతుంది.
కొనసాగబడుతున్న ఇపుడున్న రేట్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
స్కీం |
పరిమితి |
వడ్డీ రేటు |
SDF |
ఒకవేళ, సాలుసరి CSF మరియు GRF లలో పెట్టుబడుల నికర వృద్ధి మీద వాడకం జరిగితే |
రెపో రేటు మైనస్ 2 శాతం |
ఒకవేళ, G-sec / ATB లలో పెట్టుబళ్ళు మీద వాడకం జరిగితే |
రెపో రేటు మైనస్ 1 శాతం |
WMA |
అడ్వాన్స్ తీసుకున్న తేదీ నుండి 3 నెలల లోపు వరకు బాకీ ఉంటే |
రేపో రేటు |
అడ్వాన్స్ తీసుకున్న తేదీ నుండి 3 నెలల పైబడి వరకు బాకీ ఉంటే |
రెపో రేటు ప్లస్1 శాతం |
OD |
ఒకవేళ WMA లిమిట్ 100 శాతం వరకు వాడితే |
రెపో రేటు ప్లస్ 2 శాతం |
ఒకవేళ WMA లిమిట్ 100 శాతం మించి వాడితే |
రెపో రేటు ప్లస్ 5 శాతం |
(యోగేశ్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2021-2022/102
అనుబంధం: రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యుటిల యొక్క WMA పరిమితి
క్రమ సంఖ్య |
రాష్ట్రాలు/ యుటి లు |
సెప్టెంబర్ 30, 2021 వరకు WMA చెల్లుబడిపరిమితి |
1. |
2. |
3. |
1. |
ఆంధ్రప్రదేశ్ |
2,416.00 |
2. |
అరుణాచలప్రదేశ్ |
312.00 |
3. |
అస్సాం |
1,504.00 |
4. |
బీహార్ |
2,272.00 |
5. |
చత్తీసుగఢ్ |
1,056.00 |
6. |
గోవా |
272.00 |
7. |
గుజరాత్ |
3,064.00 |
8. |
హర్యానా |
1,464.00 |
9. |
హిమాచల్ ప్రదేశ్ |
880.00 |
10. |
జమ్మూ & కాశ్మీర్ |
1,408.00 |
11. |
ఝార్ఖండ్ |
1,152.00 |
12. |
కర్ణాటక |
3,176.00 |
13. |
కేరళ |
1,944.00 |
14. |
మధ్యప్రదేశ్ |
2,560.00 |
15. |
మహారాష్ట్ర |
5,416.00 |
16. |
మణిపూర్ |
312.00 |
17. |
మేఘాలయ |
280.00 |
18. |
మిజోరాం |
256.00 |
19. |
నాగాలాండ్ |
328.00 |
20. |
ఒడిషా |
1,576.00 |
21. |
పంజాబ్ |
1,480.00 |
22. |
రాజస్థాన్ |
2,608.00 |
23. |
తమిళనాడు |
3,960.00 |
24. |
తెలంగాణా |
1,728.00 |
25. |
త్రిపుర |
408.00 |
26. |
ఉత్తరప్రదేశ్ |
5,680.00 |
27. |
ఉత్తరాఖండ్ |
808.00 |
28. |
పశ్చిమ బెంగాల్ |
3,032.00 |
29. |
పుదుచ్చేరి |
208.00 |
మొత్తం (అన్ని రాష్ట్రాలు/యుటి లు) |
51,560.00 |
|