తేదీ: 14/06/2021
నియంత్రణా సమీక్ష అతారిటీ 2.0, సలహా బృందానికి
స్పందన తెలియచేయుటకు, గడువు పెంపు
ఏప్రిల్ 15, 2021 తేదీ పత్రికా ప్రకటనలో తెలిపినట్లు, రిజర్వ్ బ్యాంక్ ఒక నియంత్రణా సమీక్ష అతారిటీ (ఆర్ ఆర్ ఏ 2.0), మే 01, 2021 నుండి మొదట ఒక సంవత్సరం కాలానికి, నెలకొల్పింది.
2. ఆర్ ఆర్ ఏ కు సహాయపడడానికి, మే 07, 2021 ఒక సలహా బృందాన్నికూడా ఏర్పాటుచేసింది. తయారీ ఏర్పాట్లు చేయుటకు, ఈ బృందం అన్ని నియంత్రిత సంస్థలనుండి, పారిశ్రామిక వర్గాలనుండి మరియు ఇతర భాగస్వాములనుండి, స్పందన మరియు సలహాలు కోరింది. సలహా/స్పందనలు పంపించుటకు జూన్ 15, 2021 ఆఖరి తేదీ.
3. కోవిడ్-19 వల్ల కలిగిన ఇబ్బందుల కారణంగా మరియు భాగస్వాములనుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని, సలహా/ స్పందనలు సమర్పించుటకు కాలపరిమితి జూన్ 30, 2021 వరకు పొడిగించాలని నిశ్చయించబడింది.
(యోగేశ్ దయాల్)
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2021-2022/359 |