తేదీ: 30/06/2021
మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై , మహారాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949,
సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు
పొడిగింపు
ఆగస్ట్ 31, 2016 తేదీ జారీచేసిన DCBS.CO.BSD-I/D-4/12.22.141/2016-17 ఆదేశాలద్వారా, మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, ఆగస్ట్ 31, 2016 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి జులై 31, 2020 వరకు పొడిగించబడింది.
2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (సెక్షన్ 56తో సహా), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న నిర్దేశాలు, సెప్టెంబర్ 30, 2021 వరకు, సమీక్షకులోబడి, అమలులో కొనసాగుతాయని, జూన్ 29, 2021 తేదీన జారీచేయబడిన DOR/MON/D-21/12.22.140/2021-22 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియపరుస్తున్నాము.
3. పైన తెలిపిన నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. కాలపరిమితి పెంచుతూ, జూన్ 29, 2021 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది.
4. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితిగురించి రిజర్వ్ బ్యాంకు తృప్తిచెందినట్లు, ఏమాత్రమూ భావించరాదు.
(యోగేశ్ దయాల్)
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2021-2022/460 |