Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (213.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 06/12/2021
నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అహ్మద్ నగర్ (మహారాష్ట్ర) - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో- ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A క్రింద, నిర్దేశాలు జారీ

తేదీ: డిసెంబర్ 06, 2021

నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అహ్మద్ నగర్
(మహారాష్ట్ర) - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-
ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 56 తో కలిపి
సెక్షన్‌ 35 A క్రింద, నిర్దేశాలు జారీ

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A క్రింద, తమకు దఖలు పరచిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంకు వారి ఆదేశం Ref.No.DoS.CO.SUCBs-West/S2399/12.22.159/2021-22, తేదీ డిసెంబర్ 06, 2021, ద్వారా నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అహ్మద్ నగర్ కు, కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. వీటిని అనుసరించి డిసెంబర్ 06, 2021, పని ముగింపువేళనుండి, పైన పేర్కొన్న బ్యాంక్, రిజర్వు బ్యాంకు లిఖిత పూర్వక ముందస్తు అనుమతి లేనిదే, డిసెంబర్ 06, 2021 తేదీన జారీ చేసిన నిర్దేశాల ను అతిక్రమించి, అప్పులు మరియు ఋణాలు జారీ చేయుట / నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులు, క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటతోసహా ఎటువంటి భారము అంగీకరించుట; వారు చేసిన ఋణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగా గాని ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి అస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదని నిర్దేశించడమైనదని, ఇందు మూలముగా ప్రజలకు తెలియచేయడమైనది. డిసెంబర్ 06, 2021 తేదీన జారీ చేసిన నిర్దేశాల ప్రతి, నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అహ్మద్ నగర్ (మహారాష్ట్ర), ప్రాంగణంలో ప్రజల సమాచారం కోసం, ప్రదర్శించబడింది. ప్రత్యేకించి, సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతా నుండి, పైన ఉటంకించిన ఆర్బీఐ నిర్దేశం షరతులకు లోబడి 10,000/- (పది వేల రూపాయలు మాత్రమే) మించి, విత్ డ్రా చేయుటకు అనుమతించరాదు.

ఆర్బీఐ చే, పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంక్ లైసెన్సు రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులను సమీక్షించి, రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాలలో మార్పులు చేయవచ్చు.

ఈ నిర్దేశాలు డిసెంబర్ 06, 2021 పని ముగింపువేళనుండి, ఆరు నెలల కాలం సమీక్షకు లోబడి అమలులో ఉంటాయి.

(యోగేశ్ దయాల్)  
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/1314

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….