| 2021-22 సంవత్సరానికి కరెన్సీ మరియు ఫైనాన్స్ (RCF) పై నివేదిక |
తేదీ: ఏప్రిల్ 29, 2022
2021-22 సంవత్సరానికి కరెన్సీ మరియు ఫైనాన్స్ (RCF) పై నివేదిక
భారతీయ రిజర్వు బ్యాంకు ఈరోజున కరెన్సీ మరియు ఫైనాన్స్ (RCF) 2021-22 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. కోవిడ్ తదనంతరం స్థిరమైన పునరుద్ధరణను నెలకొల్పడం మరియు మధ్యస్థ కాలానికి పెరిగేవృద్ధి ధోరణిని పెంపొందించే సందర్భంలో, ఈ నివేదిక యొక్క థీమ్ "పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం" గ యున్నది. ఈ నివేదిక రిజర్వు బ్యాంకు అభిప్రాయాలను కాకుండా సహాయకారుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నది.
ముఖ్యాంశాలు
-
నివేదికలో ప్రస్తావించిన సంస్కరణల బ్లూప్రింట్ ఆర్థిక పురోగతికి సంబందించిన ఏడు చక్రాల చుట్టూ తిరుగుతుంటుంది, అవి మొత్తం డిమాండ్; మొత్తం సరఫరా; సంస్థలు, మధ్యవర్తి సంస్థలు మరియు మార్కెట్లు; స్థూల ఆర్థిక స్థిరత్వం మరియు విధాన సమన్వయం; ఉత్పాదకత మరియు సాంకేతిక పురోగతి; వ్యవస్థీకృత మార్పులు; మరియు ధారణీయత.
-
భారత్ లో మధ్యకాలిక దేశపు స్థిరమైన GDP వృద్ధికి ఆచరణీయమైన రేంజి 6.5- 8.5 శాతం, ఇది సంస్కరణల బ్లూప్రింట్‌కు అనుగుణంగా ఉన్నది.
-
ద్రవ్య మరియు ఆర్థిక విధానాలను సమయానుకూలంగా రీబ్యాలెన్స్ చేయడం ఈ ప్రయాణంలో మొదటి మెట్టు కావచ్చు.
-
బలమైన మరియు స్థిరమైన వృద్ధికి ధరల స్థిరత్వం తప్పనిసరి అవసరం.
-
భారతదేశ మధ్యకాలిక వృద్ధి అవకాశాలను సురక్షితంగా ఉంచడానికి, వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ సాధారణ రుణాన్ని GDPలో 66 శాతానికి తగ్గించడం చాలా ముఖ్యం.
-
సూచించబడిన వ్యవస్థీకృత సంస్కరణలు ఏమంటే వ్యాజ్యం లేని ధరతక్కువ భూమికి యాక్సెస్‌ను పెంచడం; స్కిల్ ఇండియా మిషన్ ద్వారా విద్య మరియు ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం మరియు కార్మికుల పనితనంను మెరుగుపరచడం; ఆవిష్కరణలు మరియు సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలను మెరుగుపరచడం; స్టార్టప్‌లు మరియు యునికార్న్‌ల కోసం అనుకూల వాతావరణాన్ని సృష్టించడం; అసమర్థతలను ప్రోత్సహించే సబ్సిడీల హేతుబద్ధీకరణ; మరియు హౌసింగ్ మరియు భౌతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా పట్టణ సముదాయాలను ప్రోత్సహించడం.
-
పారిశ్రామిక విప్లవం 4.0 మరియు నికరంగా-శూన్యం ఉద్గారాల లక్ష్యానికి కట్టుబడి ఉన్న మార్పులకు వ్యాపారం చేయడానికి రిస్క్ క్యాపిటల్‌కు తగిన ప్రాప్యతను అందించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీ వాతావరణం కల్పించే విధాన పర్యావరణ వ్యవస్థ ఎంతైనా అవసరం.
-
భారత్ వర్తమానపు మరియు భవిష్యత్తు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు ఎగుమతి మరియు దేశీయ ఉత్పాదక అవకాశాలను మెరుగుపరచడానికి భాగస్వామ్య దేశాల నుండి గుణీయనాణ్యత గల దిగుమతుల కోసం సాంకేతికత బదిలీ మరియు మెరుగైన వాణిజ్య నిబంధనలపై దృష్టి సారించవచ్చు.
(యోగేశ్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2022-2023/130 | |