తేదీ: మే 27, 2022
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949
క్రింద నిర్దేశాలు - మరాఠా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ముంబై,
మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు
భారతీయ రిజర్వు బ్యాంకు, ఆగస్ట్ 31, 2016 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-4/12.22.141/2016-17 ద్వారా మరాఠా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ను, ఆగస్ట్ 31, 2016 వ తేదీ పనివేళల ముగింపు నుండి ఆరు మాసాల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి ఆదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి మే 31, 2022 వరకు పొడిగించబడింది.
2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన నిర్దేశాలు ఆగస్ట్ 31, 2022 తేదీ వరకు, మే 26, 2022 నాటి తమ ఆదేశం DOR.MON/D-13/12.22.140/2022-23 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తున్నది.
3. పైన సూచించిన ఆదేశాల యొక్క అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే మే 26, 2022 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంక్ ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.
4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలను బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.
(యోగేశ్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2022-2023/274 |