సెప్టెంబర్ 07, 2022
విదేశీ ముద్రా లావాదేవీలు జరపడానికి మరియు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్
ప్లాట్‌ఫారమ్ లపై విదేశీ ముద్రా లావాదేవీలు చేయడానికి అధికారం లేని
సంస్థల హెచ్చరిక జాబితాను ఆర్‌బీఐ జారీ చేస్తుంది
భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) తన ఫిబ్రవరి 03, 2022 నాటి పత్రికా ప్రకటనలో, అనధికార ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లపై విదేశీ ముద్రా లావాదేవీలు చేపట్టవద్దని, లేదా డబ్బును పంపడం/జమ చేయడం వంటి అనధికార విదేశీ ముద్రా లావాదేవీలు జరపవద్దని ప్రజలను హెచ్చరించింది.
అయితే కొన్ని ETPల అధికార స్థితిపై వివరణ కోరుతూ ఆర్‌బీఐ సూచనలు అందుకుంటూనే ఉంది. అందుకే, విదేశీ ముద్రా నిర్వహణ చట్టం, 1999 (FEMA) క్రింద విదేశీ ముద్ర లావాదేవీలను జరపడానికిగానీ లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ లపై విదేశీ ముద్రా లావాదేవీలు చేయడానికి అధికారం లేని సంస్థల “హెచ్చరిక జాబితా” ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో పెట్టాలని నిర్ణయించారు. విదేశీ ముద్రా లావాదేవీల కోసం జారీ చేసిన హెచ్చరిక జాబితా సమగ్రమైనది కాదు మరియు ఈ పత్రికా ప్రకటన సమయంలో ఆర్‌బీఐకి తెలిసిన దాని ఆధారంగా రూపొందించింది. హెచ్చరిక జాబితా లో కనిపించని ఒక సంస్థ, ఆర్‌బీఐ చేత అధీకృతమని భావించకూడదు. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచబడిన వ్యక్తి మరియు అధీకృత ETPల అధీకృత జాబితా నుండి ఏదైనా వ్యక్తులు / ETP యొక్క అధికార స్థితిని నిర్ధారించుకోవచ్చు.
అధీకృత వ్యక్తులు మరియు అనుమతించబడిన ప్రయోజనాల కోసం, నివాసి వ్యక్తులు మాత్రమే విదేశీ ముద్రా లావాదేవీలను FEMA నియమాలకు అనుగుణంగా చేపట్టవచ్చని ఆర్‌బీఐ పునరుద్గాటిస్తుంది. ఆర్‌బీఐ ద్వారా ప్రయోజనం కోసం అధికారం కలిగిన ETPలపై, లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలలో (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్., BSE లిమిటెడ్ మరియు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.) నిబంధనల ప్రకారం మరియు ఆర్‌బీఐ నిర్దేశించిన షరతులతో మాత్రమే ఎలక్ట్రానిక్‌గా వాటిని చేపట్టాలి.
అనధికార ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లపై విదేశీ ముద్రా లావాదేవీలు చేపట్టవద్దని, లేదా డబ్బును పంపడం/జమ చేయడం వంటి అనధికార లావాదేవీలు జరపవద్దని ప్రజలను మరోసారి హెచ్చరిస్తుంది. FEMA లేదా ఆర్‌బీఐ చేత అధీకృతం కాని ETPలపై అనుమతించబడిన వాటి కంటే ఇతర ప్రయోజనాల కోసం విదేశీ ముద్రా లావాదేవీలను చేపట్టిన అట్టి నివాసి వ్యక్తులు, FEMA క్రింద చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు.
(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2022-2023/835 |