తేది: 06/12/2022
నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్‌నగర్ -
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది),
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A క్రింద విధించిన నిర్దేశాల కాల వ్యవధి పొడిగింపు
భారతీయ రిజర్వు బ్యాంకు, డిసెంబర్ 06, 2021 నాటి DoS.CO.SUCBs-West/S2399/12.22.159/2021-22 ఆదేశానుసారం, నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్‌నగర్ ను డిసెంబర్ 06, 2021 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచింది. నిర్దేశాల చెల్లుబాటు కాలానుగుణంగా పొడిగిస్తూ, చివరిగా డిసెంబర్ 06, 2022 వరకు పొడిగించబడింది.
2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949, సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) లోఉన్న అధికారాలను వినియోగించుకుని, డిసెంబర్ 06, 2022 నాటి DOR.MON.D-47/12.22.159/2022-23 ఆదేశానుసారం అట్టి నిర్దేశాలు, సమీక్షకు లోబడి, మార్చ్ 06, 2023 వరకు బ్యాంకు ఫై అమలులో వుంటాయని ప్రజలకు తెలియజేయడమైనది.
3. పైన సూచించబడిన నిర్దేశాల ఇతర నిబంధనలు మరియు షరతులలో మార్పులేదు. నిర్దేశాల పొడిగింపును తెలిపే డిసెంబర్ 06, 2022 నాటి ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది.
4. భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడిన/మార్పుచేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలగా భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తి పడినట్లు అన్వయించుకోరాదు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2021-2022/1316 |