ఫిబ్రవరి 27, 2023
COVID-19 మహమ్మారి సమయంలో ‘వ్యాపార కొనసాగింపు చర్యలు - సంకలనం’
COVID-19 మహమ్మారి సమయంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ-RBI) చేపట్టిన వ్యాపార కొనసాగింపు చర్యలపై, వొక ‘సంకలనాన్ని’ ఫిబ్రవరి 17, 2023 న ఆర్బీఐ-RBI యొక్క, కార్పొరేట్ స్ట్రాటజీ మరియు బడ్జెట్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన వార్షిక సమావేశంలో డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ దేవబ్రత పాత్ర విడుదల చేశారు.
మహమ్మారి నుండి తలెత్తే సవాళ్లను ఎదుర్కోవటానికి, భారతీయ రిజర్వు బ్యాంకు, అపూర్వమైన స్థాయి మరియు వేగంతో, ప్రజల జీవితాలను మరియు జీవనోపాధిని కాపాడటానికి; ఆర్థిక వ్యవస్థ మరియు ఫైనాన్షియల్ సెక్టార్ యొక్క రక్షణకు; నిరంతరాయంగా క్లిష్టమైన విధుల నిర్వహణకు మరియు వ్యాపార కొనసాగింపునకు; దాని ఉద్యోగులు, సర్వీస్ ప్రొవైడర్లు మరియు ఇతర వాటాదారులకు సహాయం చేయడానికి విభిన్న విద్యుక్తధర్మాల సమాహార ప్రతిస్పందనను ప్రతిష్టించింది. ఈ పీరియడ్ లో, సాంప్రదాయ మరియు సాంప్రదాయేతరమైన వందకు పైబడి అనేక చర్యలు నిర్వహించబడ్డాయి. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉంటూనే, పూర్వోత్సాహం మరియు నవోత్తేజం తో ఉండటానికి ప్రయత్నించారు.
ఈ ‘సంకలనం’ లో కోవిడ్-19 మహమ్మారిపై భారతీయ రిజర్వు బ్యాంకు చేసిన పోరాటపటిమ తద్వివరములు విశదీకరించబడ్డాయి.
(యోగేష్ దయాలళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2022-2023/1796
|