మే 08, 2023
ది త్రిచూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, త్రిస్సూర్, కేరళ
పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మే 04, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “అడ్వాన్సుల నిర్వహణ – యూసీబి లు” అనే విషయంపై ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, ది త్రిచూర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, త్రిస్సూర్, కేరళ (బ్యాంక్) పై ₹2.00 లక్షల (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (బిఆర్ యాక్ట్) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్బిఐ (RBI) ద్వారా ఈ జరిమానా విధించబడింది.
ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.
నేపథ్యo
మార్చి 31, 2021 తేదీ నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి జరిపిన చట్టబద్ధమైన తనిఖీ నివేదిక పరిశీలన, మిగతావాటితోపాటు, బ్యాంక్ బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పరిమితిని ఉల్లంఘించి గోల్డ్ లోన్‌లను మంజూరు చేసిన సందర్భాలను వెల్లడించింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆర్బిఐ (RBI) ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక షోకాజ్ నోటీసు జారీ చేయబడింది.
నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరమును మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ (RBI) ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/192
|