06/10/2023
శంత్రగాచి సహకార బ్యాంక్ లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ వారిపై భారతీయ రిజర్వ్
బ్యాంక్ నగదు జరిమానా విధింపు
‘ఎక్స్పొజర్’ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-UCB’s (పట్టణ సహకార బ్యాంకులు)” సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారము ఆధారంగా సెప్టెంబర్ 14, 2023 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా శంత్రగాచి సహకార బ్యాంక్ లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ వారిపై ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.
ఇట్టి చర్య బ్యాంక్ నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.
నేపథ్యం:
మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ తనిఖీలో భాగంగా అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన జరిపిన పిమ్మట బ్యాంకు ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంకు ఎక్స్పొజర్ పరిధి (స్థూల) మరియు ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంకు కౌంటర్ పార్టీ ఎక్స్పొజర్ పరిధిని ఉల్లంఘించినట్లుగా గుర్తించబడినది.
కావున ఆర్బిఐ రూపొందించిన చట్టబద్దమైన విదివిధానాలను పాటించని కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.
ఆర్బిఐ నోటీసుకు బ్యాంకు వారి వ్రాతపూర్వక వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ, ఇతరత్రా బ్యాంకు సమర్పించిన వివరణలను పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.
(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా విడుదల: 2023-2024/1063 |