Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (145.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 29/01/2024
కృషిసేవ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోలే, సోలాపూర్, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

తేదీ: 29/01/2024

కృషిసేవ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోలే, సోలాపూర్, మహారాష్ట్ర వారిపై
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ ‘దీనితో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ –UCBs’ అలాగే ‘ఎక్స్పొజర్’ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన సుపర్విజన్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా కృషిసేవ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోలే, సోలాపూర్ (బ్యాంక్) వారి పై 50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ చర్యలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) బ్యాంకు డైరెక్టర్లకు మరియు వారి బంధువులకు ఋణ సౌకర్యం కల్పించబడింది. (ii) SAF నందలి స్పస్టమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ RBI వారి ముందస్తు అనుమతి లేకుండ ములధన వ్యయ ఖర్చు. కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను బ్యాంకు పై ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

(యోగేష్ దయాళ్)
చీఫ్జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/1762

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….