తేదీ: 16/05/2024
గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన "ది బాపునగర్ మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.
"ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ" కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన "ది బాపునగర్ మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 08-05-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 2,00,000 (రెండు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గ నిర్దేశకాలకు భిన్నంగా ఈ బ్యాంకు ప్రవర్తించినట్లు గుర్తించి సదరు బ్యాంక్ మీద ఎందుకు చర్య తీసుకొనకూడదో వివరించాలంటూ ఒక నోటిసు ను జారీ చేసింది.ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ కు సంబధించిన పృడెన్షియల్ ఇంటెర్ బ్యాంక్ నిర్ధేశిత అవధులను అతిక్రమించినట్లు నిర్ధారించి సదరు బ్యాంక్ పై అపరాధ రుసుమును విధించింది.నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.
(పునీత్ పాంచోలి) ముఖ్య నిర్వహణ అధికారి
పత్రికా విడుదల: 2024-2025/315
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….