10 జూన్ 2024
ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్‌పై
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ 05, 2024 నాటి ఉత్తర్వు ద్వారా, ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్( బ్యాంకు) పై ‘మోసాలు - వర్గీకరణ, రిపోర్టింగ్ మరియు పర్యవేక్షణ వ్యవస్థ మార్గదర్శకాలు' పై నాబార్డ్ (NABARD) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ₹50,000/- (రూ. యాభై వేలు మాత్రమే) ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్‌లు 46(4)(i) మరియు 56తో కలుపుకొని సెక్షన్ 47A(1)(c) నిబంధనల ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించుకుని ఈ ద్రవ్య జరిమానా విధించబడింది.
బ్యాంక్ యొక్క మార్చి 31, 2023 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా NABARD చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. NABARD ఆదేశాలు పాటించకపోవడము పై పర్యవేక్షక నిర్ధారణ మరియు దాని సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా, పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. జారీ చేసిన నోటీసుకు బ్యాంకు సమర్పించిన ప్రత్యుత్తరం లోని అంశాలను మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక సమర్పణలను పరిగణలోకి తీసుకున్న తరువాత, మోసం గురించి నాబార్డ్‌కు నివేదించడంలో జరిగిన జాప్యం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదిగా ఆర్‌బిఐ, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఈ ద్రవ్య జరిమానా విధించడం వలన బ్యాంకుకు వ్యతిరేకంగా భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఏ ఇతర చర్య ప్రతికూల ప్రభావం చూపదు.
(పునీత్ పంచోలీ)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2024-2025/475 |