తేది: 24/06/2024
హీరాసుగర్ ఉద్యోగుల సహకార బ్యాంకు లిమిటెడ్, బెలగవి
కర్ణాటక పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా
(పెనాల్టీ) విధింపు.
పట్టణ సహకార బ్యాంకులు పాటించవలసిన బహిర్గత పరిమితులు మరియు చట్టబద్ధ మరియు ఇతర నిబంధనలను పాటించనందులకు గాను హీరాసుగర్ ఉద్యోగుల సహకార బ్యాంకు లిమిటెడ్, బెలగవి కర్ణాటక పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ జూన్ 21, 2024 ద్వారా రు.25,000/-(అక్షరాల ఇరవై అయిదు వేల రూపాయలు)ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i)మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.
భారతీయ రిజర్వు బ్యాంకు వారు ఈ బ్యాంకు యొక్క 2022 మార్చి, 31 వ తేదీ నాటి ఆర్ధిక పరిస్థితి పై చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు.ఆ నివేదిక లోని తనిఖీ అంశాల ఆధారంగా, పై అంశాలపై జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు,తత్సం బంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించి,ఈ బ్యాంకు పై ఎందుకు ఆర్ధిక జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు జారీచేయడమైనది. బ్యాంకు వారు సమర్పించిన వివరణ, మరియు మౌఖిక విచారణలో తెలియచెప్పిన అంశాలను పరిశీలించిన మీదట, తనిఖీ లోని అంశాలయిన అంతర బ్యాంకుల ప్రూడెన్షియల్ బహిర్గత పరిమితులు మరియు కౌంటర్ పార్టీ బహిర్గత పరిమితుల ఉల్లంఘన యాదార్ధతను గుర్తించి, ఈ ఆర్ధిక జరిమానా విధింపు చేపట్టడమైనది.
చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ఈ ఆర్ధిక జరిమానా విధింపు, భారతీయ రిజర్వు బ్యాంకు ముందు ముందు తీసుకోబోయే చర్యలకు ఆటంకము కాబోదు
(పునీత్ పంచోలీ)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రిక ప్రకటన: 2024-2025/553 |