Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (422.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 13/06/2024
గుజరాత్ అంబుజా సహకార బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ గుజరాత్, పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధింపు

తేది: 13/06/2024

గుజరాత్ అంబుజా సహకార బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ గుజరాత్, పై
భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ ను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(I)మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ని ఉల్లంఘించినందుకు గుజరాత్ అంబుజా సహకార బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ గుజరాత్ పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 28 మే, 2024 ద్వారా ఆర్ధిక రు.1.00 లక్ష (అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమె) ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధించింది.

ఈ బ్యాంకు యొక్క 31-03-2023 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు. ఈ విషయాలపై తనిఖీ నివేదికలోని అంశాల లో భారతీయ రిజర్వు బ్యాంకు వారి ఆదేశాల ఉల్లంఘన జరిగినదని, భారతీయ రిజర్వు బ్యాంకు ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది.

ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.

చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ఈ ఆర్ధిక జరిమానా విధింపు, భారతీయ రిజర్వు బ్యాంకు ముందు ముందు తీసుకోబోయే చర్యలకు ఆటంకము కాబోదు

(పునీత్ పంచోలీ) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రిక ప్రకటన: 2024-2025/499

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….