Note : To obtain an aligned printout please download the (254.00 kb ) version to your machine and then use respective software to print the story. |
Date: 22/08/2024 | మహారాష్ట్రలోని నాసిక్‌లో గల నాసిక్ జిల్హా మహిళా సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ | తేదీ: 22/08/2024
మహారాష్ట్రలోని నాసిక్‌లో గల నాసిక్ జిల్హా మహిళా సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై
ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ
మహారాష్ట్రలోని నాసిక్‌లో గల నాసిక్ జిల్హా మహిళా సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 జూలై 12న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50,000(కేవలం యాభై వేల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(బీఆర్ యాక్ట్)కు చెందిన సెక్షన్ 56తో కలుపుకుని సెక్షన్ 26ఏ(2) కిందనున్న ప్రొవిజన్లను ఉల్లంఘించడంతో నాసిక్ జిల్హా మహిళా సహకారి బ్యాంకుపై ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది.2023 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ, ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి లేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా, బీఆర్ చట్టంలో పేర్కొన్న ప్రొవిజన్లను పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ నాసిక్ జిల్హా మహిళా సహకారి బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, అర్హత కలిగిన మొత్తాన్ని ఖాతాదారుల విద్య, అవగాహన నిధికి నిర్దేశిత సమయంలో బ్యాంకు బదిలీ చేయలేదని ఆర్.బి.ఐ గుర్తించింది. బ్యాంక్ ద్వారా ఆర్.బి.ఐ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.ఆర్.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.
(పునీత్ పాంచోలి)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2024-2025/951 | |
|
|