మార్చ్ 26, 2009
‘భిన్నత్వం లో ఏకత్వం’ (యూనిటీ ఇన్ డైవర్సిటి) ఇతివృత్తంతో కొత్త ₹ 10 ద్విలోహాత్మక
(బై-మెటాలిక్) నాణేలు
భారత ప్రభుత్వం ఈ క్రింద పేర్కొన ఇతివృత్తం తో జారీ చేసిన క్రొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది.
‘భిన్నత్వం లో ఏకత్వం’
| ఆకృతి మరియు బైటపక్క వ్యాసం |
బరువు |
బాహ్యపు రింగ్ లోహo మిశ్రమo వివరాలు |
మధ్యభాగం లోహం మిశ్రమం వివరాలు |
వర్తులాకారము 27 మిల్లీమీటర్లు – ద్విలోహాత్మక
(బై-మెటాలిక్) |
7.71 గ్రాములు
(బాహ్యపు రింగ్: 4.45 గ్రాములు మరియు మధ్యభాగం: 3.26 గ్రాములు |
అల్యూమినియం - కాంస్యం రాగి – 92% అల్యూమినియం – 6% నికెల్ – 2% |
కుప్రో నికెల్ రాగి - 75% నికెల్ – 25% |
నమూనా (డిజైన్) :
ముందువైపు: నాణెం ఈ వైపు మూడు భాగాలుగా విభజించబడింది. మధ్యభాగం లో అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి, దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య చెక్కబడి ఉంటుంది. మరియు ఉబ్బైన అంతర్జాతీయ సంఖ్యలు “10” నాణెం విలువ (డినామినేషన్) ను సూచిస్తాయి.
ఉపరి భాగం “भारत” అని హిందీ మరియు “India” అని ఇంగ్లీషు పదం కలిగి ఉంటుంది. అడుగు భాగం అంతర్జాతీయ సంఖ్యలతో సంవత్సరమును కలిగి ఉంటుంది.
వెనుకవైపు: నాణెం ఈ వైపున మన దేశ విశిష్టతను నిర్వచించుతూ “భిన్నత్వం లో ఏకత్వం” (యూనిటీ ఇన్ డైవర్సిటి) శైలీకృతమైన చిత్తరువు దృశ్యం ఉంటుంది. ఈ చిహ్నం చతుర్ముఖభాగంగా ఉన్న సామాన్యుడి శరీరాన్ని సూచిస్తుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఒక జండా క్రింద గుమిగూడి తమ జాతి ఐక్యతను చాటుతున్నట్లుగా ఇది తలపిస్తుంది. ఉపాయోగదారుకు ఈ చిత్తరువు ద్యోతకంకాగానే నాణెం విలువ (డినామినేషణ్) గుర్తింపు ప్రక్రియ శీఘ్రంగా జరిగేటందుకు ఈ దృశ్యం గురుతుగా(కోడ్) ఉపకరిస్తుంది. ఎడమవైపు పై పరిధి “दस रुपये” అని హిందీ పదాలతో మరియు “Ten Rupees” అని ఇంగ్లీష్ పదాలతో కూడి ఉంటుంది.
ఈ క్రొత్త పది రూపాయల నాణెం ‘భారతీయ కాయినేజ్ యాక్ట్ 1906’ (Indian Coinage Act 1906) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతుంది.
అజిత్ ప్రసాద్
మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2008-2009/1594 |