నవంబర్ 01, 2016
జనగణన 2011 ప్రకారం బ్రాంచ్ లొకేటర్‌ను అప్ డేట్ చేసిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన బ్రాంచ్ లొకేటర్ - అన్ని వాణిజ్య బ్యాంకుల శాఖలు/కార్యాలయాల జాబితాను కలిగి ఉండే తన వెబ్ సైట్ లోని లింక్ ను అప్ డేట్ చేసింది. ఈ లింకులో ఇప్పుడు 2011 జనగణన ప్రకారం సవరించిన మూల జనాభాతో, వివిధ జనాభా బృందాలు కలిగిన శాఖలు/కార్యాలయాల వర్గీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 1, 2016 నాటి RBI సర్క్యులర్ (RBI/2016-17/60/DBR.No.BAPD.BC. 12/22.01.001/2016-17) లో పేర్కొన్న విధంగా 2011 జనగణకు అనుగుణంగా కేంద్రాల జనాభా బృంద వర్గీకరణ సెప్టెంబర్ 1, 2016 నుంచి ఉంటుంది.
తాజా (2011) జనగణన ప్రకారం జనాభాను బట్టి బ్యాంకు శాఖలు/కార్యాయలయాలున్న కేంద్రాలను (గ్రామం/పట్టణం) నాలుగు విభాగాలుగా(గ్రామీణ, అర్ధ పట్టణ, పట్టణ, మెట్రోపాలిటన్) లుగా వర్గీకరించారు. బ్రాంచ్ లొకేటర్ లోని పట్టికలకు సంబంధించిన గమనికల(నోట్స్) తో పాటు లింక్ (https://rbi.org.in/scripts/bs_viewcontent.aspx?Id=2035) లో కేంద్రాలను గుర్తించడానికి ఉపయోగించిన సవివరమైన మార్గదర్శకాలను కూడా అప్ డేట్ చేయడం జరిగింది.
ఆయా బ్యాంకులు, బ్యాంక్ ఆదరైజేషన్ సంభందిత రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ సర్క్యులర్ ను అనుసరించి ఇచ్చిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ క్రోడీకరిస్తుంది.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-17/1081 |