అధ్యాయం अध्याय 2
సంజ్ఞా / నామవాచకములు, సర్వనామములు – వాటి మీద లింగ, వచన కారకాల ప్రభావం
संज्ञा एवं सर्वनाम तथा उन पर लिंग, वचन और कारक का प्रभाव
2.1 సంజ్ఞా / నామవాచకాలు संज्ञा
వ్యక్తి, స్థల, వస్తు, భావముల పేరులను నామవాచకాలు / సంజ్ఞలు అని అంటారు. హిందీలో నామవాచకాలు మూడు రకాలు: 1) వ్యక్తి నామవాచకాలు, 2)జాతి వాచకాలు 3) భావ వాచకాలు
किसी व्यक्ति, स्थान, वस्तु अथवा भाव के नाम को संज्ञा कहते हैं। हिंदी में संज्ञा के तीन मुख्य भेद हैं: 1. व्यक्तिवाचक संज्ञा, 2. जातिवाचक संज्ञा और 3. भाववाचक संज्ञा
నామవాచకాల పరివర్తన संज्ञाओं का रूप-परिवर्तन
నామవాచకాలు పరివర్తన చెందే పదాలు. ఈ పరివర్తనకు మూడు కారణాలు 1) లింగం 2) వచనం ౩) కారకం
संज्ञा विकारी शब्द हैं। संज्ञा शब्द के रूप तीन कारणों से बदलते हैं : 1. लिंग से, 2. वचन से और 3. कारक से।
2.2 సర్వనామాలు सर्वनाम
నామవాచకాల స్థానంలో వచ్చేవి సర్వనామాలు. ఉదాహరణకు మోహన్ ఆజ్ అస్వస్థ్ హై, ఉస్ కో డాక్టర్ కే పాస్ లే జావో . ఈ వాక్యంలో ‘మోహన్’ స్థానే ‘ఉస్ కో’ అన్న పదాన్ని ప్రయోగించారు. అంటే ఈ పదం సర్వనామ పదం. నామవాచకాన్ని పదే పదే ఉపయోగించడానికి మారుగా సర్వనామాన్ని ఉపయోగిస్తారు.
ఖుద్, స్వయం, స్వత: కూడా నిజవాచక సర్వనామాలుగా ప్రయుక్త మవుతాయి. మై ఖుద్ యహ్ కామ్ కర్ సక్తాహూ, ఆప్ స్వయం వహా జాయియే.
सर्वनाम वे शब्द हैं जो संज्ञाओं के स्थान पर प्रयोग किए जाते हैं। उदाहरण: मोहन आज अस्वस्थ है। उसको डॉक्टर के पास ले जाओ।
इस वाक्य में मोहन के स्थान पर ‘उसको’ का प्रयोग किया गया है। अत: यह सर्वनाम है। सर्वनाम का प्रयोग संज्ञा के बार-बार प्रयोग को दूर करने के लिए किया जाता है।
खुद, स्वयं, स्वत: भी निजवाचक सर्वनाम के रूप में प्रयुक्त होते हैं। जैसे- मैं खुद यह काम कर सकता हूं; आप स्वयं वहां जाइए।
సర్వనామ పదాల స్వరూప వివరణ / सर्वनाम शब्दों की रूप-रचना
నామవాచకాలతో పోలిస్తే కొన్ని సర్వనామాలు కారకాల మూలంగా ఎక్కువ పరివర్తన కలుగుతుంది. ఎక్కువగా మారే సర్వనామాల స్వరూపాలు ఈ విధంగా ఉంటాయి.
संज्ञाओं की तुलना में कुछ सर्वनामों में कारकों के कारण अधिक रूपांतर देखा जाता है। कुछ बहुप्रचलित सर्वनामों की रूप-रचना इस प्रकार हैं :
మై –మై, మైనే, ముఝే, ముఝ్ కో, ముఝ్ సే, మేరేద్వారా, మేరే లియె, మేరా, మేరే, మేరీ, ముఝ్ మే, ముఝ్ పర్
मैं- मैं, मैंने, मुझे, मुझको, मुझसे, मेरे द्वारा, मेरे लिए, मेरा, मेरे, मेरी, मुझमें, मुझ पर
హమ్-హమ్, హమ్ నే, హమే, హమ్ కో, హమ్ సే, హమారే ద్వారా, హమారే లియే, హమారా, హమారే, హమారీ, హమ్ మే, హమ్ పర్.
हम- हम, हमने, हमें, हमको, हमसे, हमारे द्वारा, हमारे लिए, हमारा, हमारे, हमारी, हममें, हम पर
తూ: తూ, తూనే, తుఝ్ కో, తుఝ్ సే, తేరే ద్వారా, తేరే లియే, తేరా, తేరే, తేరీ, తుఝ్ మే, తుఝ్ పర్
तू- तू, तूने, तुझे, तुझको, तुझसे, तेरे द्वारा, तेरे लिए, तेरा, तेरे, तेरी, तुझमें, तुझ पर
తుమ్: తుమ్, తుమ్ నే, తుమ్హే, తుమ్ కో, తుమ్ సే, తుమ్హారే ద్వారా, తుమ్హారె లియే, తుమ్హారా, తుమ్హారే, తుమ్హారీ, తుమ్ మే, తుమ్ పర్
तुम- तुम, तुमने, तुम्हें, तुमको, तुमसे, तुम्हारे द्वारा, तुम्हारे लिए, तुम्हारा, तुम्हारे, तुम्हारी, तुममें, तुम पर
వహ్ – వహ్, ఉస్ నే, ఉసే, ఉస్ కో, ఉన్ సే, ఉస్ కే ద్వారా, ఉస్ కే లియే, ఉస్ కా, ఉస్ కే , ఉస్ కీ, ఉస్ మే, ఉస్ పర్,
वह- वह, उसने, उसे, उसको, उससे, उसके द्वारा, उसके लिए, उसका, उसके, उसकी, उसमें, उस पर
వే: వే, ఉన్హోనే, ఉన్హే, ఉన్ కో, ఉన్ సే, ఉన్ కే ద్వారా, ఉన్ కే లియే, ఉన్ కా, ఉన్ కే, ఉన్ కీ,ఉన్ మే, ఉన్ పర్
वे- वे, उन्होंने, उन्हें, उनको, उनसे, उनके द्वारा, उनके लिए, उनका, उनके, उनकी, उनमें, उन पर
కౌన్: కౌన్, కిస్నే, కిన్హోనే, కిస్ కో, కిసే, కిన్హే, కిన్కో మొ!!
कौन- कौन, किसने, किन्होंने, किसको, किसे, किन्हें, किनको आदि।
జో- జిస్నే, జిన్హోం నే, జిస్ కో, జిసే, జిన్ కో, జిన్హేఁ మొ!!
जो- जिसने, जिन्होंने, जिसको, जिसे, जिनको, जिन्हें आदि।
2.3 లింగం लिंग Gender
లింగం: హిందీ భాషలో రెండే లింగాలున్నాయి. (i) పుంలింగం (Masculine Gender), (ii) స్త్రీ లింగం (Feminine Gender). స్థూలంగా లింగాన్ని గుర్తిచేందుకు కొన్ని సూచనలివ్వడం జరిగింది. వీటికి ఎన్నో అపవాదాలున్నా, ఇవి ఉపయోగపడతాయి
लिंग - हिंदी भाषा में दो ही लिंग माने जाते हैं – (i) पुल्लिंग और (ii) स्त्रीलिंग। आम तौर पर लिंग की पहचान के लिए कुछ संकेत दिए जा रहे हैं, इनके कई अपवाद हैं, फिर भी अधिकांश स्थानों पर ये सहायक हो सकते हैं :
2.3.1 పుంలింగం पुल्लिंग:
1. ఆకారాంత శబ్దాలు : ఉదా: కప్ డా, పైసా, పహియా, ఆటా మొ!! అపవాదం – హవా, దవా, సజా, ఖటియా మొ!!
‘आ’ से अंत होने वाले शब्द: उदा- कपड़ा, पैसा, पहिया, आटा आदि।
अपवाद- हवा, दवा, सजा, खटिया आदि।
2. ‘నా’, ‘ఆవ్’, ‘పన్’, ‘పా’తో అంతమయ్యే భావవాచకాలు- గానా, బహావ్, లడక్ పన్, బచ్ పన్, బుఢాపా మొ!!
‘ना’, ‘आव’, ‘पन’, ‘पा’ से अंत होने वाली भाववाचक संज्ञाएं : गाना, बहाव, लड़कपन, बचपन, बुढ़ापा आदि।
3. ఆన్ తో అంతమయ్యే క్రియార్ధక వాచకాలు: లగాన్, ఖాన్ పాన్, మిలాన్ మొ!!
‘आन’ से अंत होने वाली क्रियार्थक संज्ञाएं : लगान, खान-पान, मिलान आदि।
4. ‘త్వ’, ‘త్య’, ‘వ్య’ ‘ర్య’తో అంతమయ్యే నామ వాచకాలు వ్యక్తిత్వ్, కృత్య, కర్తవ్య్, చాతుర్య మొ!!
‘त्व’, ‘त्य’, ‘व्य’, ‘र्य’ से अंत होने वाली संज्ञाएं : व्यक्तित्व, कृत्य, कर्तव्य, चातुर्य आदि।
5. ‘అ’ తో అంతమయ్యే నామవాచకాలు: ఘర్, మకాన్, ఖేత్, పేడ్ మొ!! అపవాదాలు- కితాబ్, కలమ్, దీవార్, మొ!!
‘अ’ से अंत होने वाली संज्ञाएं : घर, मकान, खेत, पेड़ आदि।
अपवाद : किताब, कलम, दीवार आदि।
6. దేశాలు, పర్వతాలు, సముద్రాల పేర్లు: భారత్, చీన్, జపాన్, అమెరికా, ఇటలీ, హిమాలయ, వింధ్యాచల్, ఆల్ప్స్, హింద్ మహాసాగర్, అరబ్ సాగర్ మొ!!
देशों, पर्वतों, सागरों के नाम : भारत, चीन, जापान, अमेरिका, इटली, हिमालय, विंध्याचल, आल्प्स, हिंद महासागर, अरब सागर आदि।
7. అన్ని ధాతువులు, నగల పేర్లు: సోనా, హీరా,లోహా మొ!! అపవాదం- చాందీ.
सभी धातुओं और गहनों के नाम : सोना, हीरा, लोहा आदि।
अपवाद : चाँदी।
8. రోజుల: నెలల పేర్లు:
రోజులు: రవివార్, సోమ్ వార్, మంగల్ వార్, బుధ్ వార్, గురు వార్, శుక్ర వార్, శనివార్
दिनों और महीनों के नाम :
दिन- रविवार, सोमवार, मंगलवार, बुधवार, गुरुवार, शुक्रवार और शनिवार।
నెలలు: చైత్ర, వైశాఖ్, జేఠ్, ఆషాఢ, శ్రావణ్, బాద్ర్ పద్, ఆశ్విన్, కార్తిక, మార్గశీర్ష, పౌష్, మాఘ, ఫాల్గున్
महीने- चैत्र, वैशाख, जेठ, आषाढ़, श्रावण, भाद्रपद, आश्विन, कार्तिक, मार्गशीर्ष, पौष, माघ, फाल्गुन।
9. చెట్ల పేర్లు: ఆమ్ (మామిడి), కట్ హల్ (పనస), తాడ్ (తాడి), పీపల్ (వేప), బర్ గద్ (మర్రి), సాగౌన్ (టేకు), శీశమ్ (రోజ్ వుడ్) మొ!!
అపవాదం : ఇమ్ లీ (చింత)
पेड़ के नाम : आम, कटहल, ताड़, पीपल, बरगद, सागौन, शीशम आदि।
अपवाद : इमली।
10. ధాన్యాల పేర్లు: ధాన్ (ధాన్యం), చావల్ (బియ్యం), గేహూఁ (గోధుమ), బాజరా (చిట్టి జొన్న), చనా (శనగ), తిల్ (నువ్వులు)
అపవాదం: జ్వార్ (జొన్న), దాల్ (పప్పు), అరహర్ (కందులు), మటర్ (బటాణీలు)
अनाजों के नाम : धान, चावल, गेहूं, बाजरा, चना, तिल।
अपवाद : ज्वार, दाल, अरहर, मटर।
2.3.2 స్త్రీ లింగం स्त्रीलिंग
1. ఈ కారాంత పదాలు: నదీ, చిట్ఠీ, టోపీ, రోటీ, గాలీ, వినతీ. అపవాదం: పానీ, ఘీ, జీ, దహీ, మోతీ.
‘ई’ से अंत होने वाली संज्ञाएं : नदी, चिट्ठी, टोपी, रोटी, गाली, विनती।
अपवाद : पानी, घी, जी, दही, मोती।
2. ఊన (తక్కువతనం తెలిపే) వాచకాలు: ఖటియా, డిబియా, పుడియా
ऊनवाचक संज्ञाएं : खटिया, डिबिया, पुडि़या।
3. ఆకారంత సంస్కృత నామవాచకాలు: దయా, కృపా, క్షమా. అపవాదాలు: పితా, కర్తా.
‘आ’ से अंत होने वाली संस्कृत की संज्ञाएं: दया, कृपया, क्षमा।
अपवाद : पिता, कर्ता।
4. ఇకారంత వాచకాలు: రుచి, విధి, గతి. అపవాదం: ముని, ఋషి
‘इ’ से अंत होने वाली संज्ञाएं : रुचि, विधि, गति।
अपवाद : मुनि, ऋषि।
5. తా, వట్, హట్, ట్, త్ అంతమయ్యే నామవాచకాలు:సుందరతా, రుకావట్, ఘబరాహట్, బనావట్, బగావత్
‘ता’, ‘वट’, ‘हट’, ‘ट’, ‘त’ से अंत होने वाली संज्ञाएं : सुंदरता, रुकावट, घबराहट, बनावट, बगावत।
6. త లేదా ట తో అంతమయ్యేవి: ఛత్, ఖాట్, హాట్. అపవాదం: పేట్, ఖేత్ మొ!!
‘त’ या ‘ट’ से अंत होने वाली संज्ञाएं : छत, खाट, हाट।
अपवाद : पेट, खेत आदि।
7. నదుల పేర్లు: గంగ, జమునా, గోదావరి, కృష్ణా, కావేరి. అపవాదం: సింధు, బ్రహ్మపుత్ర.
नदियों के नाम : गंगा, जमुना, गोदावरी, कृष्णा, कावेरी।
अपवाद : सिंधु, ब्रह्मपुत्र।
8. భాషల పేర్లు: హిందీ, జపానీ, ఇంగ్లీష్, జర్మన్ మొ!!
भाषाओं के नाम : हिंदी, जापानी, अंग्रेज़ी, जर्मन आदि।
9. ఊతో అంతమయ్యేవి: లూ, బాలూ, ఝాడూ
ऊ’ से अंत होने वाले शब्द : लू, बालू, झाड़ू
అపవాదం : ఆలూ, ఆంసూ, డాకూ, భాలూ
अपवाद : आलू, आंसू, डाकू, भालू।
ఉదాహరించిన సంకేతాలు కేవలం ఉదాహరణలు మాత్రమే. జాగ్రత్తగా చదవడం, నిఘంటువుల ద్వారా ఎక్కువగా తెలుసుకోవచ్చు నామవాచకాల లింగ విజ్ఞానం కోసం కింద కొన్ని సూచనలు ఇవ్వడమైంది
उपर्युक्त संकेत केवल उदाहरण स्वरूप के हैं और इनका दायरा अत्यंत सीमित है। ध्यानपूर्वक पठन और शब्द कोश के सहारे जानकारी को बढ़ाया जा सकता है। तथापि, संज्ञा के लिंग की जानकारी के लिए कुछ सुझाव नीचे दिए गए हैं :
1. క్రియలలో: సర్కార్ ఆదేశ్ జారీ కర్తీహై. బైంక్ అధి సూచనా జారీ కర్తీహై
क्रिया से : सरकार आदेश जारी करती है; बैंक अधिसूचना जारी करता है।
2. నామవాచక విశేషణాలలో: అచ్ఛా లడ్ కా, అచ్ఛీ లడ్ కీ, మోటీ ఫాయిల్, మోటా రిజిస్టర్
संज्ञा के विशेषण से : अच्छा लड़का; अच्छी लड़की; मोटी फाइल; मोटा रजिस्टर।
3. నామవాచకాలతో కలిసిన విభక్తులలో : వ్యయ్ కీ రాశి, గత్ వర్ష కా పురస్కార్
संज्ञा के साथ जुड़ी विभाक्ति से : व्यय की राशि; गत वर्ष का पुरस्कार।
4. వచనం వల్ల – లడ్ కా, లడ్ కే
वचन से : लड़का – लड़के।
గమనిక: అకారాంత పుంలింగ శబ్దాల వచనం మార్చడానికి ఆను ఏగా మార్చాలి. ఇతర పుంలింగ శబ్దాలలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఏక్ ఘర్ - చార్ ఘర్, ఏక్ పత్ర్ - పాంచ్ పత్ర్
नोट : ध्यान रखें कि ‘आ’ से अंत होने वाले पुल्लिंग शब्दों का वचन बदलने के लिए ‘आ’ को ‘ए’ में बदल दिया जाता है। अन्य पुल्लिंग शब्दों में ऐसा कोई परिवर्तन नहीं किया जाता है। जैसे- एक घर – चार घर। एक पत्र – पांच पत्र।
2. 4 వచనం वचन
పదాలు ఏ రూపంలో ఒకటి లేదా అంతకు మించిన సంఖ్యను సూచిస్తాయో దాన్ని వచనంగా భావిస్తారు. హిందీలో ఏకవచనం, బహువచనం ఉన్నాయి.
शब्द के जिस रूप से उसके एक या अनेक होने का बोध हो उसे वचन कहते हैं। हिंदी भाषा में दो वचन हैं : एकवचन और बहुवचन।
ఏకవచనం: ఒక వ్యక్తి, వస్తు, బోధక రూపాలు ఏకవచన రూపాలు.
ఉదా: ఘోడా, కన్యా, నదీ మొ!!
एकवचन : शब्द के जिस रूप से एक व्यक्ति या वस्तु का बोध हो उसे एकवचन कहते हैं। जैसे- घोड़ा, कन्या, नदी।
బహు వచనాలు: అధిక వ్యక్తులు, వస్తువులు సూచించే రూపాలే బహు వచనం.
ఉదా: ఘోడే, కన్యాయేఁ, నదియాఁ.
बहुवचन : शब्द के जिस रूप से एक से अधिक व्यक्तियों या वस्तुओं का बोध हो उसे बहुवचन कहते हैं। जैसे- घोड़े, कन्याएं, नदियां।
2. 5 కారకం कारक
నామవాచకాలకు లేదా సర్వనామాలకు క్రియలతో ఉండే సంబంధాన్ని తెలియజేసే స్థితిని కారకం అంటారు. కారకీయ సంబంధం తెలియ జేసేందుకు ప్రయోగితమయ్యే చిహ్నాలను కారకచిహ్నాలు లేదా విభక్తులు లేదా పరసర్గలు అంటారు. కారకాలు 8 విధాలు.
संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध क्रिया के साथ जाना जाता है, उसको कारक कहते हैं। कारकीय संबंध को प्रकट करने वाले चिह्नों को कारक-चिह्न, विभक्ति या परसर्ग कहते हैं। कारक के आठ भेद होते हैं :
వరుస సంఖ్య | కారకం పేరు | విభక్తి లేదా పరసర్గ |
1 | కర్త | ‘నే’ లేదా ‘0’ (ఏమీ లేదు) |
2 | కర్మ | ‘కో’ లేదా ‘0’ (ఏమీ లేదు) |
3 | కరణం | సే, కే ద్వారా, కే సాథ్ (సాధన వ్యక్తీకరణకు) |
4 | సంప్రదానం | కో, కే లియే, హేతు |
5 | అపాదానం | సే |
6 | సంబంధం | కా,కే, కీ (రా, రే, రీ, నా, నే, నీ) |
7 | అధికరణం | మే, పర్ |
8 | సంబోధన | హే, రే, అరే, ఓ |
क्र.सं. | कारक का नाम | विभक्ति या परसर्ग |
1 | कर्ता | ‘ने’ या ‘o’ (कुछ भी नहीं)।@ |
2 | कर्म | ‘को’ या ‘o’ (कुछ भी नहीं)।# |
3 | करण | से, के द्वारा, के साथ (साधन प्रकट करने के लिए) |
4 | संप्रदान | को, के लिए, हेतु |
5 | अपादान | से (अलगाव दर्शाने के लिए) |
6 | संबंध | का, के, की (रा, रे, री, ना, ने, नी) |
7 | अधिकरण | में, पर |
8 | संबोधन* | हे, रे, अरे, ओ… |
2.5.1 నే ప్రయోగం ‘ने’ का प्रयोग
కర్త కారకంలో ‘నే’ ప్రయోగం సామాన్యంగా సకర్మక ధాతువులతో ఉన్న భూతకాలిక కృదంతాల తో నిర్మితమైన (క్రియ అధ్యాయం చుడండి) క్రియలలో వస్తుంది: రామ్ నే రోటీ ఖాయీ, మోహన్ నే పత్ర్ లిఖా హై, సీతానే ఆమ్ ఖరీదే థే. ఈ వాక్యాలలో ఖాయీ, లిఖా, ఖరీదే అన్న సకర్మక ధాతువులు ఖానా, లిఖ్ నా , ఖరీద్నాల భూతకాలిక కృదంతాలు, అందువల్ల ఈ కర్తలకు ‘నే’ వచ్చింది. అకర్మక ధాతువుల క్రియ రూపాలకు ‘నే’ ప్రయోగం రాదు, రామ్ గయా, మోహన్ బహుత్ చిల్లాయా, సీతా ఖూబ్ సోయీ.
कर्ता कारक में ‘ने’ का प्रयोग सामान्यत: केवल सकर्मक धातुओं से बने भूतकालिक कृदंत (देखिए क्रिया का अध्याय) से बनी क्रियाओं के साथ होता है : राम ने रोटी खाई, मोहन ने पत्र लिखा है, सीता ने आम खरीदे थे। इन वाक्यों में खाई, लिखा, खरीदे सकर्मक धातु खाना, लिखना, खरीदना के भूतकालिक कृदंत हैं, अत: इनके कर्ता के साथ ‘ने’ लगा है। अकर्मक धातुओं से बने क्रिया-रूपों के साथ ‘ने’ का प्रयोग नहीं होता : राम गया, मोहन बहुत चिल्लाया, सीता खूब सोई।
కొన్ని అపవాదాలు:
कुछ अपवाद हैं :
a) బోల్నా, భూల్నా, లానాలు సకర్మక క్రియలు. అయినా వీటి భూతకాలిక రూపాలకు ‘నే’ ప్రయోగం జరగదు.
(क) बोलना, भूलना, लाना सकर्मक क्रियाएँ हैं किन्तु इनसे बने भूतकालिक रूपों के साथ ने का प्रयोग नहीं होता।
b) నహానా, ఛీంక్ నా, ఖాంస్నా అకర్మ క్రియలు. వీటి భూతకాలిక కృదంతాలకు నే వస్తుంది.
(ख) नहाना, छींकना, खाँसना, अकर्मक क्रियाएँ हैं, किन्तु इनसे बने भूतकालिक कृदन्तों के साथ ने का प्रयोग होता है।
c) లగ్నా, సక్నా, జానా, చుక్ నా, పానా, రహనా, ఉఠ్ నా, బైఠ్ నా, పఢ్ నా సహాయక క్రియలు సకర్మక ధాతువులుతో ఉంటే ‘నే’ ప్రయోగం ఉండదు.
(ग) लगना, सकना, जाना, चुकना, पाना, रहना, उठना, बैठना, पड़ना, सहायक क्रियाएँ लगने पर सकर्मक धातुओं के साथ भी ‘ने’ का प्रयोग नहीं होता।
d) కొంతమంది బక్నా, జాన్ నాల తో, నే ప్రయోగిస్తున్నారు కానీ కొంతమంది ప్రయోగించరు.
(घ) कुछ लोग तो बकना, जानना आदि के साथ ‘ने’ का प्रयोग करते हैं, किन्तु कुछ लोग नहीं करते।
2. 6 (విభక్తులను దృష్టిలో ఉంచుకొని) నామవాచక పదాలలో వచనం మార్పిడి నియమాలు संज्ञा शब्दों का वचन बदलने के नियम (कारक चिन्हों को ध्यान में रखते हुए)
వాక్యాలలో నామవాచక శబ్దాలతో ఎన్నో మార్లు నే, కో, సే, కేలియే అనే విభక్తి ప్రత్యయాలు వస్తుంటాయి. కొన్ని సార్లు రావు. అందువల్ల బహువచనాలు కూడా రెండు విధాలుగా తయారవుతాయి.
वाक्य में प्रयोग करते समय संज्ञा शब्दों के साथ कई बार ने, को, से, के लिए आदि कारक-चिह्न लगते हैं और कई बार नहीं लगते। इस कारण शब्दों के बहुवचन भी दो प्रकार से बनते हैं :
(ఎ) విభక్తి ప్రత్యయాలు లేని రూపాలు
(क) जब शब्दों के साथ कारक-चिह्न नहीं लगते।
(బి) విభక్తి ప్రత్యయాలు సహిత రూపాలు
(ख) जब शब्दों के साथ कारक-चिह्न लगते हैं।
1) ఆకారాంత పుంలింగం (ఘోడా వంటివి)
आकारांत पुल्लिंग – (जैसे घोड़ा)
ఈ పులింగ వర్గంలో లడ్ కా, బచ్చా, గధా, రుప్యా, కుత్తా, చూహా, బేటా, చీతా, కీడా, సాలా, పర్దా, దర్వాజా, బగీచా మొ!! అధిక సంఖ్యలో ఆకారాంత సమూహంలో ఉన్నాయి. వీటికి అపవాదాలు కుడా ఉన్నాయి.
इस पुल्लिंग वर्ग में लड़का, बच्चा, गदहा (गधा), रुपया, कुत्ता, चूहा, बेटा, चीता, कीड़ा, साला, पर्दा, दरवाज़ा, बग़ीचा आदि अधिसंख्य आकारांत शब्द आते हैं। इसके कुछ अपवाद भी हैं –
2) ఇతర పుంలింగాలు : (వ్యంజనాంతాలు అంటే హల్లు అంతంలోవచ్చేవి, మిత్ర, ఇకరాంత కవి, ఈకారాంత సాథీ, ఉకారాంత సాధు, ఊకారాంత డాకూ మొ!!)
अन्य पुल्लिंग – (जैसे व्यंजनांत मित्र, इकारांत कवि, ईकारांत साथी, उकारांत साधु तथा ऊकारांत डाकू आदि)
3) ఇకారాంత (జాతి) ఈకారాంత (లడ్ కీ ) ఇయాంత (గుడియా) స్త్రీ లింగాలు
इकारांत – (जैसे जाति), ईकारांत (जैसे लड़की), इयांत (जैसे गुडि़या) स्त्रीलिंग।
4) ఇతర స్త్రీ లింగాలు (వ్యంజనాంతాలయిన పుస్తక్, ఆకారాంత మాతా, ఉకారాంత ఋతు, ఊకారాంత బహూ, ఔకారాంత గౌ మొ.)
अन्य स्त्रीलिंग – (जैसे व्यंजनांत पुस्तक, आकारांत माता, उकारांत ऋतु, ऊकारांत बहू तथा ओकारांत गौ आदि)
2.7 విశేషణాలు विशेषण
నామవాచకాల, సర్వనామాల, విశేషత్వాన్ని తెలిపే పదాలను విశేషణా లంటారు. ఉదా: యహ్ సుందర్ ఫూల్ హై; వహ్ కాలా ఘోడా హై, పాంచ్ లడ్ కియాఁ పడ్ రహీ హైఁ, గిలాస్ భర్ దూధ్ లావో, కాలే బాదల్ ఘిర్ ఆయేహైఁ, యహ్ బాగ్ సుందర్ హై.
जिस शब्द से संज्ञा या सर्वनाम की विशेषता प्रकट होती है, उसे विशेषण कहते हैं। जैसे- यह सुंदर फूल है; वह काला घोड़ा है; पांच लड़कियां पढ़ रही हैं; गिलास भर दूध लाओ; काले बादल घिर आए हैं; यह बाग सुंदर है।
గమనిక : విశేషణం ఏపదముయొక్క విశేషత్వాన్ని తెలుపుతుందో దానిని విశేష్యం అంటారు. ఉదా: సుందర్ ఫూల్ లో సుందర్ విశేషణం అయితే ఫూల్ విశేష్యం.
नोट : विशेषण जिस शब्द की विशेषता प्रकट करता है उसे विशेष्य कहा जाता है। जैसे- सुंदर फूल में सुंदर विशेषण और फूल विशेष्य ।
విశేషణాలలో లింగ వచన, కారక సంబంధమైన తేడాలు తక్కువగా ఉంటాయి. కేవలం కొన్ని ఆకారంత విశేషణాలే మారుతుంటాయి.
ఉదా: అచ్ఛా లడ్ కా, అచ్ఛే లడ్ కే, అచ్ఛీ లడ్ కీ, అచ్ఛే లడ్ కే కో, అచ్ఛే లడ్ కోం కో, అచ్ఛీలడ్కీకో.
विशेषणों में लिंग, वचन और कारक संबंधी अंतर बहुत कम होता है। केवल कुछ ‘आकारांत’ (‘आ’ से अंत होने वाले) विशेषणों में ही इस प्रकार के परिवर्तन आते हैं। जैसे- अच्छा लड़का, अच्छे लड़के, अच्छी लड़की। अच्छे लड़के को, अच्छे लड़कों को, अच्छी लड़की को।
2.8 ఉపసర్గలు , ప్రత్యయాలు – उपसर्ग एवं प्रत्यय
2.8.1 ఉపసర్గలు उपसर्ग
ఉపసర్గలు స్వతంత్ర ప్రయోగం కానివి, పదాలకు ముందు విశేషార్ధం సూచించడానికి ప్రయోగిస్తారు.
‘उपसर्ग’ उस वर्ण या वर्ण-समूह को कहते हैं, जिसका स्वतंत्र प्रयोग न होता हो, और जो किसी शब्द के पूर्व, कुछ अर्थपूर्ण विशेषता लाने के लिए जोड़ा जाए।
ఉపసర్గల చరిత్ర అతి ప్రాచీనం. మొదట ఇవి స్వతంత్రంగా ఉండి విడిగా అర్ధం బోధించేవి. కాలక్రమంలో స్వతంత్ర ప్రయోగ సామర్థ్యం కోల్పోయి కేవలం మూల పద సంబంధంతో వచ్చాయి. సంస్కృతంలో ప్ర, పరా, అప, సమ, అను, అవ, నిస్, నిర్, దుర్, మొ!! 22 ఉప సర్గలున్నాయి.
भारोपीय परिवार में उपसर्गों का इतिहास काफी प्राचीन काल तक जाता है। पहले ये स्वतंत्र शब्द थे तथा इनका अपना अर्थ था। बाद में इनकी यह स्वतंत्रता पूर्णत: समाप्त हो गई और ये केवल मूल शब्द से संबद्ध होकर ही आने लगे। संस्कृत में प्र, परा, अप, सम, अनु, अव, निस्, निर्, दुस्, दुर् आदि 22 उपसर्ग माने जाते हैं।
చారిత్రకంగా హిందీ ఉపసర్గలు 3 రకాలు – తత్సమాలు (అభావ్, అభిమాన్ వంటివి) తద్భవాలు (పైసే, ఉన్చాస్) విదేశ్యాలు (దర్ అసల్, ఉప్ గవర్నర్).
ऐतिहासिक दृष्टि से हिंदी उपसर्ग तीन प्रकार के हैं – तत्सम(जैसे अभाव, अभिमान) तद्भव (पैसे,उनचास), विदेश (जैसे दरअसल, उप गवर्नर) ।
2.8.2 ప్రత్యయాలు प्रत्यय
ధ్వనులు లేదా ధ్వని సమూహాలుగా ఉన్న ప్రత్యయాలను పదముల, లేక ధాతువుల చివర జోడించడం వల్ల పదం లేదా రూపం నిర్మిత మవుతుంది.
प्रत्यय ध्वनि अथवा ध्वनि-समूह की वह भाषिक इकाई है जिसे किसी शब्द अथवा धातु के अंत में जोड़कर शब्द अथवा रूप की रचना की जाती है।
తత్సమ ప్రత్యయాలు: సంస్కృత సమానంగా ఉంటాయి. వైజ్ఞానిక్ లో ‘ఇక్’, ప్రియాలో ‘ఆ’ మొ!!
तत्सम प्रत्यय – ये संस्कृत के समान हैं, जैसे वैज्ञानिक (इक), प्रिया (आ) आदि।
తద్భవ ప్రత్యయాలు: ఇవి హిందీ భాషలో ఎక్కువ. కఠినాయీ (ఆయీ) బనావట్ (ఆవట్) మొ!!
तद्भव प्रत्यय - तद्भव प्रत्यय हिंदी में काफ़ी है, जैसे कठिनाई (आई), बनावट (आवट) आदि।
దేశీయాలు: అజ్ఞాత వ్యుత్పత్తికాలు – ఉదా. ఘుమక్కడ్ (అక్కడ్)
देशज प्रत्यय - देशज प्रत्यय अज्ञात व्युत्पत्तिक होते है। जैसे घुमक्कड़ (अक्कड़) ।
విదేశీయ ప్రత్యయాలు: పార్సీ, అరబ్బీ, ఇంగ్లీష్ భాషల ద్వారా ప్రవేశించినవి – కార్ (సలాహ్ కార్), ఇజమ్ (కమ్యూనిజమ్), మొ.
विदेशी प्रत्यय - फ़ारसी (अरबी) एवं अंग्रेजी से आए प्रत्यय, जैसे कार (सलाहकार), इज्म (कम्यूनिज्म)
2.9 క్రియలు , క్రియా విశేషణాలు क्रिया और क्रिया विशेषण
2.9.1 క్రియలు क्रिया
కార్యాలు లేదా పనులను సూచించే పదాలు. ఉదా: రామ్, చిట్ఠీ లిఖ్ తా హై, ఫాయిలేఁ అల్మారీ మేఁ రఖీహైఁ ; పేడ్ కీ డాలీ టూట్ గయీ.
जिस शब्द से किसी कार्य के करने का या होने का बोध हो उसे क्रिया कहते हैं। उदाहरण:
राम चिट्ठी लिखता है; फाइलें अलमारी में रखी हैं; पेड़ की डाली टूट गई।
మొదటి వాక్యంలో రాయడం, రెండోదాంట్లో ఉంచడం మూడోదాట్లో విరగడం అనే పనులను సూచిస్తున్నాయి. కాబట్టి అర్థాన్ని సూచించే పదాలు క్రియలు:
पहले वाक्य में राम ‘लिखने’ का कार्य कर रहा है और दूसरे दोनों में ‘रखने’ और ‘टूटने’ का कार्य हो रहा है। इसलिए ये तीनों पद क्रिया के उदाहरण हैं।
2.9.2 ధాతువులు धातु
క్రియా మూలాంశాలు ధాతువులు. ఉదా: పఢ్, లిఖ్, ఉఠ్, ఖేల్, సో, దేఖ్ మొ!! ధాతువులకు ‘నా’ చేర్చడం వల్ల సామాన్య రూపాలు ఏర్పడతాయి. పఢ్ నా , లిఖ్ నా, ఉఠ్ నా, ఖేల్ నా, సో నా, దేఖ్ నా, మొ!!
क्रिया के मूल अंश को धातु कहते हैं। जैसे- पढ़, लिख, उठ, खेल, सो, देख आदि। धातु के पीछे ‘ना’ जोड़ने से पढ़ना, लिखना, उठना, खेलना, सोना, देखना आदि क्रिया के सामान्य रूप में बन जाते हैं।
ప్రతి ఒక్క క్రియలోనూ రెండు అంశాలుంటాయి. వ్యాపారం (కార్యం), ఫలం. కర్త క్రియ కార్యం నిర్వహిస్తాడు, క్రియ ఫలితం దేనికి చెందుతుందో అది కర్మ.
प्रत्येक क्रिया में दो बातें होती हैं – व्यापार (कार्य) और फल। कर्ता- क्रिया के व्यापार को करने वाला; कर्म- जिस पर क्रिया का फल पड़ता है।
ధోబీ కప్ డే ధోతాహై – ఈ వాక్యంలో ధోతాహై క్రియ. ధోనేకా అన్న కార్యం ధోబీ చేస్తాడు. దాని ఫలిత ప్రభావం ‘క పడే’ మీద ఉంటుంది. కాబట్టి ధోభీ కర్త, కపడే కర్మ, కప్ డే లేకుండా ధోనా క్రియ లేదు.
‘धोबी कपड़े धोता है’ – इस वाक्य में ‘धोता है’ क्रिया है, धोने का व्यापार (कार्य) धोबी करता है और उसका फल ‘कपड़े’ पर पड़ता है। इस वाक्य में ‘धोबी’ कर्ता है और ‘कपड़े’ कर्म। ‘कपड़े’ के बिना ‘धोना’ क्रिया नहीं हो सकती।
2.9.3 క్రియలలో తేడాలు क्रिया के भेद -
క్రియలు రెండు రకాలు: సకర్మకాలు, అకర్మకాలు
क्रिया के दो भेद होते हैं : (i) सकर्मक और (ii) अकर्मक।
(i) సకర్మకాలు: ఈ క్రియలతో కర్మ ఉంటుంది లేదా అది ఉండే సంభవనీయత ఉంటుంది. క్రియ ఫలం కర్మ మీద కనబడుతుంది. ఉదా: విభాగ్ నే పుస్తక్ ఖరీదీ, నరేష్ పత్ర లిఖేగా, సర్కార్ నియమ్ బనాయేగీ.
(i) सकर्मक क्रिया : सकर्मक क्रियाओं के साथ कर्म होता है या उसके होने की संभावना रहती है। अर्थाత్त् जिन क्रियाओं का फल कर्म पर पड़ता है, उन्हें ‘सकर्मक’ क्रियाएं कहते हैं। उदाहरण:
विभाग ने पुस्तक खरीदी; नरेश पत्र लिखेगा; सरकार नियम बनाएगी।
ఈ వాక్యాలలో పుస్తక్, పత్ర్, నియమ్ కర్మలు. ఖరీద్ నా, లిఖ్ నా, బనానా అనే కార్యాలను వేరే వారు చేస్తున్నా ఫలభారం వీటి మీదే పడుతోంది. కాబట్టి సకర్మకాలు.
इन वाक्यों में पुस्तक, पत्र और नियम कर्म हैं। खरीदने, लिखने और बनाने का कार्य तो कोई और कर रहा है पर फल इन पर पड़ रहा है। अत: ये तीनों क्रियाएं सकर्मक हैं।
(ii) అకర్మకాలు अकर्मक क्रिया
అకర్మక క్రియల వెంట కర్మ ఉండదు. క్రియలయొక్క పని, ఫలం కర్తకే ఆపాదిస్తే అకర్మకాలు అవుతాయి. ఎందుకంటే వాటికీ కర్మ ఉండదు.
अकर्मक क्रियाओं के साथ कर्म नहीं रहता। अर्थात् जिन क्रियाओं के व्यापार और फल दोनों कर्ता में ही पाए जाएं उन्हें ‘अकर्मक’ क्रिया कहते हैं। क्योंकि उनमें कर्म नहीं होता है।
ఉదా: రాజేష్ సోయా హై, దీపా హఁస్తీ హై, బచ్చే ఖేల్ తే హైఁ, పక్షీ ఉడ్ తాహై- ఈ వాక్యాలలో సోయాహై, హఁస్తీ హై, ఖేలతే హైఁ, ఉడ్ తా హై అనేవి అకర్మక క్రియలు
उदाहरण : राजेश सोया है; दीपा हँसती है; बच्चे खेलते हैं; पक्षी उड़ता है।
इन वाक्यों में सोया है, हँसती है, खेलते हैं और उड़ता है – अकर्मक क्रियाएं हैं।
2.9.4 క్రియల కాలబోధకత / क्रिया का काल
ఏదైనా పని జరగబోయే, జరిగిన, జరుగుతున్న సూచించే అంశాన్ని కాలం అంటారు, వీటిలో మూడు భేదాలున్నాయి.
क्रिया का वह रूप जिससे उसके होने या करने का समय जाना जाए, काल कहते हैं। इसके तीन भेद हैं:
భూతకాలం: గడిచిన సమయంలో క్రియ జరగడంలేదా చేయడం సూచించడాన్ని భూత కాలం అని వ్యవహరిస్తారు. మోహన్ నే టిప్పణీ లిఖీ.
क) भूत काल : भूत काल क्रिया का वह रूप है जिससे बीते समय में क्रिया का होना या करना पाया जाए। जैसे- मोहन ने टिप्पणी लिखी।
వర్తమాన కాలం: ఇది జరుగుతున్న సమయంలో క్రియ జరగడం లేదా చేయడం సూచిస్తుంది. ఉదా. ప్రభా గానా గాతీ హై.
ख) वर्तमान काल : वर्तमान काल क्रिया का वह रूप है जिससे वर्तमान (चालू) समय में क्रिया का होना या करना पाया जाए। जैसे- प्रभा गाना गाती है।
భవిష్యత్ కాలం: ఇది రాబోయే సమయంలో క్రియ జరగడం లేదా చేయడం సూచిస్తుంది. ఉదా. వహ్ దిల్లీ కల్ జాయేగా.
ग) भविष्यत् काल : भविष्यत् काल क्रिया का वह रूप है जिससे भविष्यत् (आने वाले) समय में क्रिया का होना या करना पाया जाए। जैसे- वह कल दिल्ली जाएगा।
2.9.5 క్రియ బోధకత: क्रिया का वाच्य
చేసిన / చేస్తున్న/ చేయబోయే కార్యానికి ప్రధాన విషయం కర్తనా కర్మనా, భావమా అని తెలిపే అంశాన్ని క్రియ బోధకత అంటారు.
वाच्य क्रिया का वह रूप है जिससे यह माना जाए कि क्रिया द्वारा किए हुए कार्य का प्रधान विषय कर्ता है, कर्म है या भाव है। वाच्य के तीन भेद हैं :
1) కర్తృ వాచ్యం: క్రియ యొక్క లింగ వచన విభక్తులు కర్తను అనుసరిస్తాయి. దీనిని కర్తృ ప్రధాన క్రియ అనికూడా వ్యవహరిస్తారు. ఉదా. సహాయక్ మసౌదా లిఖ్ తా హై, లతా కథా సునాతీ హై, కర్మ చారీ కామ్ కర్ తే హైఁ.
कर्तृवाच्य : इसमें क्रिया का लिंग, वचन और पुरुष ‘कर्ता’ के अनुसार होता है। इसको कर्तृप्रधान क्रिया भी कहते हैं। जैसे- सहायक मसौदा लिखता है। लता कथा सुनाती है। कर्मचारी काम करते हैं।
2) కర్మ వాచ్యం: క్రియ యొక్క లింగ వచన విభక్తులు కర్మను అనుసరించి ఉంటాయి. దీనిని కర్మ ప్రధాన క్రియ అని కూడాఅంటారు. ఉదా.: సహాయక్ ద్వారా మసౌదా లిఖా గయా, సర్కార్ ద్వారా నియమ్ బనాయే జాతేహైఁ.
హిందీలో ఎక్కువగా కర్తృ వాచ్యాలే ప్రయోగిత మవుతాయి.
कर्मवाच्य : इसमें क्रिया का लिंग, वचन और पुरुष ‘कर्म’ के अनुसार होता है। इसको कर्मप्रधान क्रिया भी कहते हैं। जैसे- सहायक द्वारा मसौदा लिखा गया। सरकार द्वारा नियम बनाए जाते हैं।
हिंदी में अधिकतर कर्तृवाच्य का ही प्रयोग होता है।
3) భావ వాచ్యం: ఇందులో క్రియాభావం ముఖ్యం. కర్మ, కర్తలు అప్రధానాలు. ఇటువంటివి భావ బోధకాలు. కర్తకు ‘సే’ లేదా ‘ కే ద్వారా’ జోడించడం వల్ల కర్తృ వాచ్యం నుంచి భావవాచ్యానికి మారిపోతాయి. ముఝ్ సే బోలా భీ నహీఁజాతా, హమ్ సే బైఠా నహీఁ జాతా, రాధా సే రాత్ భర్ కైసే జగా జాయేగా ?
भाववाच्य : क्रिया के जिस रूप में न कर्ता की प्रधानता हो और न कर्म की, बल्कि जहां क्रिया का भाव ही मुख्य हो, उसे भाववाच्य कहते हैं। इसमें कर्ता के आगे ‘से’ या ‘के द्वारा’ लगा दें तो कर्तृवाच्य से भाववाच्य रूप बनाया जा सकता है। उदाहरण :
- मुझसे बोला भी नहीं जाता।
- हमसे बैठा नहीं जाता।
- राधा से रात भर कैसे जगा जाएगा?
2.10 వాక్యరచన లేదా సంయోజన वाक्य-रचना अथवा संयोजन
వాక్యరచనలో ప్రాథమికంగా పద సంయోజనతో జరుగుతుంది. ఈ పదాలు నామవాచకం, విశేషణం, క్రియ, అన్వయాలుతో కూడి ఉంటాయి.
वाक्य की रचना मूलत: पदों से होती है। ये पद संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया तथा अव्यय होते हैं।
అప్పుడప్పుడు వాక్య సంయోజన పదబంధాలతో కూడా ఉంటుంది. అంటే వాక్యం పదబంధం, నామవాచకం, సర్వ నామం, విశేషణం, క్రియ విశేషణాలు మొ!! వాటితో నిర్మితమవుతుంది.
कभी-कभी पदों से पदबंध की रचना होती है, और वाक्य की रचना में ये पदबंध, संज्ञा, सर्वनाम, विशेषण, क्रियाविशेषण आदि के रूप में आते हैं।
ఈ అంశాలు సామాన్య వాక్యాల సంయోజనలో ఉంటాయి. ఇది వరకు వివరించి నట్టుగా వాక్యంలో ఉద్దేశ్యం, విధేయం ఉంటాయి. సంయుక్త, మిశ్రమ వాక్యలలో విభిన్న సరళ వాక్యాలు ఉంటాయి. మిశ్రమ వాక్యలలో విభిన్నసరళ వాక్యాలు ఉంటాయి. మిశ్రమ వాక్యాలు ఒకటి, లేదా అంతకు మించి సామాన్య వాక్యాలుంటాయి. మిశ్రిత వాక్యంలో ఒక ప్రధాన ఉపవాక్యం, మిగిలినవి ఆశ్రిత ఉపవాక్యాలుగా ఉంటాయి. సంయుక్త వాక్యాలలో ఇమిడి పోయే సామాన్య వాక్యాలు ఉపవాక్యాలుగా ఉన్నప్పటికీ అవి ఆశ్రితంగా ఉండవు.
उपर्युक्त बातें सरल वाक्य की रचना में मिलती हैं जिसमें, जैसा कि पीछे कहा जा चुका है, कि एक उद्देश्य और एक विधेय होता है। संयुक्त और मिश्रित वाक्य की रचना जैसा कि पीछे दिया गया है, विभिन्न प्रकार के सरल वाक्यों से होती है। मिश्रित वाक्य में दो या अधिक सरल वाक्य इस प्रकार जोड़े जाते हैं कि उनमें एक तो प्रधान उपवाक्य हो जाता है, और शेष आश्रित उपवाक्य रहते हैं। संयुक्त वाक्य में सरल वाक्य इस प्रकार जोड़े जाते हैं कि कोई भी उपवाक्य आश्रित नहीं होता।
వాక్యరచనలో పదాల ద్వారా పదబంధ సంయోజన, పదబంధాల ద్వారా ఉపవాక్య సంయోజన సమ్మేళనం పొందుతుంటాయి. మూడు అంశాలు ఈ సందర్భంగా గుర్తించాలి. అవి: పదక్రమం, అన్వయం, అధ్యాహారం, ఈ మూడింటిని విడిగా పరిశీలించడం జరుగుతుంది.
पदों से वाक्य-रचना करने के संदर्भ में पदक्रम एवं अन्वय का विशेष महत्व है, जिसका विवेचन नीचे दर्शाया गया है:
2.11 పదక్రమం पदक्रम (word order)
వాక్యంలో పదాలు ఉండే వరుసక్రమమే పదక్రమం. పదాలను కొంతమంది శబ్దాలని వ్యవహరిస్తారు. కాబట్టి పదక్రమాన్ని శబ్ద క్రమమనీ వ్యవహరిస్తారు. ప్రతి భాషలో వాక్యాలకు నిర్ణయించబడిన పదక్రమం ఉంటుంది. ఉదాహరణకు: ఇంగ్లీషు భాషలో కర్త + క్రియ + కర్మ (రామ్ కిల్డ్ మోహన్) అనేది క్రమమైతే, హిందీలో కర్త + కర్మ + క్రియ (రామ్ నే మోహన్ కో మార్ డాలా). ఇప్పుడు మనం హిందీ భాషలో పదక్రమం గురించి చర్చించు కుంటున్నాం: అందులో ఇమిడి ఉన్న ప్రధానాంశాలివి:
‘पदक्रम’ का अर्थ है ‘वाक्य में पदों के रखे जाने का क्रम’। ‘पद’ को ‘शब्द‘ कहने के कारण कुछ लोग ‘पदक्रम’ को ‘शब्दक्रम’ भी कहते हैं। हर भाषा के वाक्य में पदों या शब्दों के अपने क्रम होते हैं। उदाहरण के लिए अंग्रेजी में कर्ता+क्रिया+कर्म (Ram killed Mohan) का क्रम है तो हिंदी में कर्ता+कर्म+क्रिया (राम ने मोहन को मार डाला)। यहां हिंदी वाक्यों में पदक्रम पर विचार किया जा रहा है। मुख्य बातें निम्नांकित हैं—
1. కర్త వాక్యంలో మొదట్లోనూ, క్రియ సాధారణంగా చివరగానూ ఉంటుంది. మోహన్ గయా, లడ్ కా దౌడా, వాక్యంలో ప్రాధాన్యత సూచించినప్పుడు పదక్రమం వ్యతిరేకంగా కూడా ప్రయుక్తమవుతుంది. ఉదా: గయా వహ్ లడ్ కా, పాస్ హోచు కేతుమ్.
कर्ता वाक्य में पहले और क्रिया प्राय: अंत में होती है : मोहन गया, लड़का दौड़ा। यों बल देने के लिए क्रम उलट भी सकते हैं। गया वह लड़का, पास हो चुके तुम।
2. కర్తకు సంబంధించిన విస్తరింపు కర్తకు ముందు, క్రియకు సంబంధించిన విస్తరింపు కర్త తరువాత వస్తాయి.- రామ్ కా లడ్ కా మోహన్ గాడీసే అప్నే ఘర్ గయా.
कर्ता का विस्तार उसके पहले तथा क्रिया का विस्तार कर्ता के बाद आता है : राम का लड़का मोहन गाड़ी से अपने घर गया।
3. కర్మ మరియు పూరకం, కర్త మరియు క్రియల మధ్య వస్తాయి. రామ్ నే పుస్తక్ లీ. రెండు కర్మలునప్పుడు మొదట అప్రధాన కర్మ, తరవాత ప్రధాన కర్మ వస్తుంది. రామ్ నే మోహన్ కో పత్ర్ లిఖా. కర్మ మరియు పూరక సంబంధమైన విస్తరణలు వాటికి ముందుగానే వస్తూంటాయి. రామ్ నే అప్నే మిత్ర్ కే బేటే రాజీవ్ కో బధాయీ కా పత్ర్ లిఖా, మోహన్ అచ్ఛా డాక్టర్ హై. ప్రాధాన్యతకుగాను కర్మ ముందుగా కూడా రావచ్చు. పుస్తక్ లేలీ తుమ్ నే?
कर्म तथा पूरक कर्ता और क्रिया के बीच में आते हैं : राम ने पुस्तक ली। यदि दो कर्म हों तो गौण कर्म पहले तथा मुख्य कर्म बाद में आता है : राम ने मोहन को पत्र लिया। कर्म तथा पूरक के विस्तार उनके पूर्व आते हैं : राम ने अपने मित्र के बेटे राजीव को बधाई का पत्र लिखा, मोहन अच्छा डाक्टर है। बल देने के लिए कर्म पहले भी आ सकता है : पुस्तक ले ली तुमने?
4. విశేషణాలు సామాన్యంగా విశేష్యాలకు ముందుగా వస్తాయి. తేజ్ ఘోడే కో ఇనామ్ మిలా, అకర్మణ్య విద్యార్థీ ఫెయిల్ హో గయా. పూరక విశేషణాలు విశేష్యాల తరువాత వస్తాయి. రామ్ లంబాహై, హై, థా, హోగా వంటి క్రియలున్నప్పుడు అలా జరుగుతుంది.
సాధారణంగా విశేషణాలు క్రియలకు ముందుగా వచ్చినా, అప్పుడప్పుడు క్రియ తర్వాత, వాక్యాంతంలో కూడా వస్తాయి. చాహే కుఛ్ భీ న హో భాయి, హై వహ్ సుందర్.
विशेषण प्राय: विशेष्य के पूर्व आते हैं : तेज़ घोड़े को इनाम मिला, अकर्मण्य विद्यार्थी फेल हो गया है। पूरक विशेषण विशेष्य के बाद आते हैं। राम लंबा है, था, होगा जैसी क्रियाएँ जब होंगी तब ऐसा प्रयोग किया जाता है।
सामान्यतः विशेषण क्रिया से पहले आते हैं, पर कभी-कभी क्रिया के बाद और वाक्य के अंत में भी आते हैं। उदाहरण - चाहे कुछ भी न हो भाई, है वह सुंदर।
5. క్రియావిశేషణాలు కర్త, క్రియల మధ్య వస్తాయి: బచ్చా ధీరే ధీరే ఖా రహా హై. కాలబోధన క్రియా విశేషణాలు అపుడప్పుడు ప్రాధాన్యత కోసం కర్తకు ముందుగా వస్తాయి. అబ్ మైజారహా హూఁ – మైఁ అబ్ జారహా హూఁ. స్థాన బోధకాలు కూడా ఇలాగే వస్తాయి. భారత్ కే ఉత్తరీ భాగ్ మే కాశ్మీర్ హై – కాశ్మీర్ భారత్ కే ఉత్తరీ భాగ్ మే హై. రెండు పక్క పక్కనే ప్రారంభంలో రావచ్చు. ఆజ్ ఇస్ హాల్ మే కవి సమ్మేళన్ హో రహా హై. క్రియా విశేషణాలు కర్త, కర్మల మధ్య వస్తాయి. (మై ధీరే ధీరే ఉసే సిఖా రహా హూఁ, లడ్ కా ఛుప్ ఛుప్ కే తైయారీ కర్ రహా హై). అపవాదంగా క్రియావిశేషణాలు, ఇతరంగా కూడా రావచ్చు. చలో చలేఁ అబ్, ఆ గయే ఫిర్ యహీఁ, శీఘ్ర హీ ఆవుంగా మైఁ. ఆవుంగా శీఘ్ర హీ.
क्रियाविशेषण प्राय: कर्ता और क्रिया के बीच में आते हैं : बच्चा धीरे-धीरे खा रहा है। कालबोधक क्रियाविषेषण कभी-कभी बल देने के लिए कर्ता से पहले आते हैं। अब मैं जा रहा हूँ – मैं अब जा रहा हूँ। स्थानबोधक भी इसी प्रकार प्रयुक्त होते हैं। भारत के उत्तरी भाग में कश्मीर है – कश्मीर भारत के उत्तरी भाग में है। दोनों पास-पास ही प्रारंभ में आ सकते हैं। आज इस हाल में कवि-सम्मेलन हो रहा है। क्रियाविशेषण कर्ता और कर्म के बीच में आते हैं। (मैं धीरे-धीरे उसे सिखा रहा हूँ, लड़का छुप- छुपके तैयारी कर रहा है)। अपवाद के तौर पर क्रियाविषेषण अन्य प्रकार से भी आ सकते हैं। उदा. चलो चलें अब, आ गये फिर यहीं, शीघ्र ही आऊँगा मैं, आऊँगा शीघ्र ही।
6. సర్వనామాలు నామవాచకస్థానే వస్తాయి. కానీ ఇక్కడ రెండంశాలు గుర్తుంచుకోవాలి. (ఎ) సర్వనామాలు వాక్యాల్లో సంభోధనలుగా రావు. (బి) విశేషణాలు సర్వనామాలకు ముందు రాకుండా తరువాత వస్తాయి. వహ్ అచ్ఛా హై. తుమ్ మూర్ఖ్ హో.
सर्वनाम प्राय: संज्ञा के स्थान पर आता है। लेकिन यहाँ दो बातों का ध्यान रखना होगा। (क) सर्वनाम वाक्यों में संबोधन के तौर पर नहीं आते। (ख) विशेषण सर्वनाम से पहले नहीं, बल्कि बाद में आते हैं। उदा. वह अच्छा है। तुम मूर्ख हो।
7. హిందీలో సాధారణంగా క్రియ వాక్యాంతంలో వస్తుంది. మై చలా, మై అబ్ చలా. కానీ ప్రాధాన్యతకు ఆరంభంలో రావచ్చు. హై భీ వహ్ యహాఁ : గయా భీహోగా వహ్. అజ్ఞార్ధంలో క్రియకు ప్రాధాన్యత ఇస్తే మొదట్లో వస్తుంది. జావో తుమ్ – తుమ్ జావో: బైఠో వహాఁ – వహాఁ బైఠో, లిఖోతో జరా – తో జరా లిఖో – తో లిఖో జరా – చాహియే కి కూడా ఇదే పరిస్థితి : చాహియేతో థా కి ముఝ్ సే మిల్ లేతే ; చాహియే యే తో బహుత్ కుఛ్, మగర్ కర్ తా కౌన్ హై?
हिंदी में क्रिया सामान्यत: अंत में आती है : मैं चला, मैं अब चला। लेकिन प्रधानता के तौर पर वह आरंभ में भी आ सकता है। है भी वह यहाँ, गया भी होगा वह। आज्ञार्थ में जहाँ क्रिया पर बल दिया जाता है, तब वाक्य में वह पहले आती है। जाओ तुम – तुम जाओ, बैठो वहाँ – वहाँ बैठो, लिखो तो ज़रा – तो ज़रा लिखो – तो लिखो ज़रा। चाहिए के लिए भी ऐसी ही स्थिति हैः चाहिए तो था कि मुझसे मिल लेते, चाहिए यह तो बहुत कुछ, मगर करता कौन है?
8. ప్రక్రియా విశేషణాలుః ప్రక్రియా విశేషణాలు సాధారణంగా విశేషణ క్రియావిశేషణాలకు ముందు వస్తాయి. వహ్ బహుత్ లంబా హై. ఘోడా కాఫీ తేజ్ భాగ్ రహా థా.
प्रक्रिया विशेषणः प्रक्रिया विशेषण सामान्यतः विशेषण और क्रियाविशेषण से पहले आते हैं। वह बहुत लंबा है, घोड़ा काफी तेज भाग रहा था।
9. ప్రశ్నవాచక సర్వ నామాలు, క్రియాపదములకు ఆరంభంలో (కౌన్ ఆ రహా హై, కహాఁ జా రహే హో), మధ్యలో క్రియకు ముందు (వహాఁ కౌన్ ఆ రహా హై? తుమ్ కహాఁ జారహేహో) అప్పుడప్పుడు క్రియల మధ్య (వహాఁ ఆ కౌన్ రహా హై, తుమ్ జా కహాఁ రహే హో), చివర (జాయేగా కౌన్? వహా జాయేగా కౌన్?, జారహే హో కహాఁ? రహోగే కహాఁ) వస్తాయి. ప్రశ్న వాచక పదాలు ప్రశ్నించే అంశం ముందు వస్తాయి. కౌన్ ఆద్మీ ఆయేగా? క్యా చీజ్ చాహియే?, తుమ్ క్యా దేఖ్ రహేహో ? వహ్ కైసే జారహా హై? దీన్ని స్థానం బదలాయిస్తే ఎంతో తేడా వస్తుంది. ప్రయోగ సావధానత మరి పోతుంది. క్యా తుమ్ లిఖ్ రహే హో? – తుమ్ క్యా లిఖ్ రహేహో ? – తుమ్ లిఖ్ క్యా రహేహో? – తుమ్ లిఖ్ రహే హో క్యా?
प्रश्नवाचक सर्वनाम क्रियाबोधक शब्दों के प्रारंभ में (कौन आ रहा है?, कहाँ जा रहे हो?), बीच में क्रिया से पहले (वहाँ कौन आ रहा है?, तुम कहाँ जा रहे हो?), कभी-कभी क्रियाओं के बीच में (वहाँ आ कौन रहा है?, तुम जा कहाँ रहे हो?), तथा अंत में (जायेगा कौन?, वहाँ जायेगा कौन?, जा रहे हो कहाँ?, रहोगे कहाँ?) आते हैं। प्रश्नवाचक शब्द प्रश्न के संबंधित अंश के पहले आते हैं। उदा. कौन आदमी आयेगा?, क्या चीज चाहिए?, तुम क्या देख रहे हो?, वह कैसे जा रहा है?। इसका स्थान बदलने पर अर्थ में बहुत अंतर आयेगा। क्या तुम लिख रहे हो? -- तुम क्या लिख रहे हो? -- तुम लिख रहे हो क्या?
10. ప్రధాన క్రియలకు ముందు పూర్వ కాలిక క్రియలు వస్తాయి. మై ఖాకర్ ఆయా హూఁ. వహ్ ఆకర్ ఆరామ్ కర్ రహా హై. ప్రాధాన్యత కోసం కర్తకు ముందు వస్తాయి. చల్ కర్ తుమ్ దేఖ్ లో. కర్మ ఉన్నప్పుడు పుర్వకాలిక క్రియ ముందే వస్తుంది. పండిత్ జీ నహాకర్ పూజా కర్ తేహైఁ. ప్రాధాన్యతలో దీనికి భిన్నంగా వస్తుంది. నహాకర్ పండిత్ జీ పూజా కరతేహైఁ – పండిత్ జీ పూజా నహాకర్ కర్ తే హైఁ – పండిత్ జీ పూజా కర్ తే హీ నహాకర్.
प्रधान क्रियाओं से पहले पूर्वकालिक क्रियाएँ आती हैं। उदा. मैं खाकर आया हूँ। वह आकर आराम कर रहा है। ये प्रधानता के लिए कर्ता से पहले आती हैं। उदा. चलकर तुम देख लो। कर्म के रहने पर पूर्वकालिक क्रिया पहले ही आती है। उदा. पंडितजी नहाकर पूजा करते हैं। बल दिये जाने पर यह भिन्न रूप से आती है। उदा. नहाकर पंडितजी पूजा करते हैं। -- पंडितजी पूजा नहाकर करते हैं। -- पंडितजी पूजा करते ही नहाकर।
11. సంబోధనలు వాక్యారంభంలో వస్తాయి. రామ్, కహాఁ చలే? మిత్ర్, ఆవోయహాఁ బైఠో. అప్పుడప్పుడు చివరి స్థాయి : బైఠో మిత్ర్! చలో భాయి? ఉఠో మోహన్ ! కహాఁ జారహే హో రాజీవ్!
संबोधन वाक्य के प्रारंभ में आते हैं। उदा. राम, कहाँ चले? मित्र, आओ यहाँ बैठो। कभी-कभी अंत में इनका प्रयोग होता है। उदा. बैठो मित्र!, चलो भाई!, उठो मोहन!, कहाँ जा रहे हो राजीव?
12. కరణ కారకంలోని వాక్యంలో క్రియ కర్త, కర్మల మధ్య వస్తుంది. శీలానే కలమ్ సే పత్ర లిఖే. ప్రాధాన్యత ఇవ్వ దలచు కున్నప్పుడు దీంట్లో మార్పులు జరుగుతాయి. కలమ్ సే శీలా నే పత్ర లిఖే. మైఁనే పత్రతో లిఖా కలమ్ సే అవుర్ ఖో గయీ హై పెన్సిల్.
करण कारक वाले वाक्य में कर्ता और कर्म के बीच में क्रिया आती है। उदा. शीला ने कलम से पत्र लिखे। बल देने के लिए इसमें परिवर्तन होते हैं। उदा. कलम से शीला ने पत्र लिखे।, मैंने पत्र तो लिखा कलम से और खो गई है पेन्सिल।
13. సంప్రదాన కారకంతో కర్త తరువాత లేదా కారణానికి ముందు (మోహన్ అప్నీ బహన్ కే లియే డాక్ సే సాడీ భేజ్ రహా హై) లేదా కారణం తరవాత (మోహన్ డాక్ సే అప్నీ బహన్ కే లియే సాడీ భేజ్ రహా హై) క్రియ వస్తుంది.
संप्रदान कारक के साथ कर्ता के बाद या कारण से पहले (मोहन अपनी बहन के लिए डाक से साड़ी भेज रहा है) अथवा कारण के बाद (मोहन डाक से अपनी बहन के लिए साड़ी भेज रहा है) क्रिया आती है।
14. అపాదాన కారకంలో కర్త క్రియల మధ్య (లడ్ కా ఛత్ సే గిరా) లేదా కర్త, కర్మల మధ్య (మైనే అల్మారీసే కప్ డే నికాలే) వస్తుంది. ప్రాధాన్యతలో మరో విధంగా కూడా ప్రయోగించవచ్చు. అల్మారీసే మైనే కప్ డే నికాలే – కప్ డే నికాలే అల్మారీసే ఔర్ టూట్ గయా సందూక్, వాహ్ యహ్ భీ కోయీ బాత్ హుయీ.
अपादान कारक में कर्ता और क्रिया के बीच में (लड़का छत से गिरा) अथवा कर्ता और कर्म के बीच में (मैंने अल्मारी से कपड़े निकाले) आती है। बल देने के लिए इसका प्रयोग अन्य प्रकार से भी किया जा सकता है। -- अलमारी से मैंने कपड़े निकाले – कपड़े निकाले अलमारी से और टूट गया संदूक।, वाह! यह भी कोई बात हुई?
15. అధికరణంలో సాధారణంగా వాక్యం మధ్యలో క్రియకు ముందు వస్తుంది (కప్ డే సందూక్ మేఁ హైఁ, డాకూ ఘోడే పర్ హై) కానీ ప్రధాన్యంలో ఇతరంగా కూడా వస్తుంది. సందూక్ మేఁ కప్ డే హైఁ, తుమ్హే దూం కై సే, ఘోడే పర్ డాకూ హై, ఔర్ ఆప్ పైదల్ ఉస్ కా పీఛా కర్నా చాహతే హైఁ .
अधिकरण में सामान्यतः वाक्य के बीच में क्रिया से पहले आती है। (कपड़े संदूक में हैं, डाकू घोड़े पर है)। लेकिन बल देने के तौर पर अन्य प्रकार से भी इसका प्रयोग होता है। उदा. संदूक में कपड़े हैं, तुम्हें दूँ कैसे?, घोड़े पर डाकू है, और आप पैदल उसका पीछा करना चाहते हैं।
16. నకారం వాక్యాలలో చివరలో వస్తుంది. తో తుమ్ షామ్ కీ చాయ్ పర్ ఆవోగే న? వహ్ మేరా కామ్ కర్ దేగా న?
`न’ का प्रयोग वाक्य के अंत में होता है। उदा. तो तुम शाम की चाय पर आओगे न? वह मेरा काम कर देगा न?
17. నిషేధాత్మకంలో అవ్యయాలు సాధారణంగా క్రియకు ముందు వస్తాయి. మైఁ నహీఁ జా రహా హూఁ. ప్రాధాన్యతలో, ఉపవాక్యం జత చేస్తున్నప్పుడు వేరే విధంగా కూడా వస్తుంది. నహీఁ జావూంగా మైఁ – నహీఁ మైఁ జావూంగా దేఖే క్యా కర్ తే హో – మై జావూంగా నహీఁ తుమ్ చాహే కుఛ్ భీ బకో.
निषेधात्मक प्रयोग में अव्यय सामान्यतः क्रिया से पहले आते हैं। उदा. मैं नहीं जा रहा हूँ। बल देने के लिए उप-वाक्य जोड़ते समय अन्य प्रकार से भी इसका प्रयोग होता है। उदा. नहीं जाऊँगा मैं – नहीं मैं जाऊँगा, देखें क्या करते हो -- मैं जाऊँगा नहीं तुम चाहे कुछ भी बको।
18. సముఛ్చయార్ధక అవ్యయాలు పదాల, పద బంధాల మధ్య వస్తాయి. ఒక వేళ కొన్నింటిని కలిపే సందర్భంలో సామాన్యంగా చివరి రెంటి మధ్య వస్తాయి. ముందు వాటికి కామా గుర్తును ఉంచుతారు; సురేష్, సౌరభ్, రాజీవ్ ఔర్ గిరీష్ ఆ రహే హైఁ; సిపాహియోం నే ఉసే పక్ డా, మారా, ఔర్ హవాలాత్ మే బంద్ కర్ దియా.
समुच्चयार्थक अव्यय शब्दों और शब्द-समूहों के बीच में आते हैं। अगर कुछ शब्दों को मिलाकर प्रयुक्त करने के संदर्भ में सामान्यतः अंतिम दो के बीच में आते हैं। पहले प्रयुक्त के लिए अल्पविराम रखा जाता है। उदा. सुरेश, सौरभ, राजीव और गिरीश आ रहे हैं।, सिपाहियों ने उसे पकड़ा, मारा और हवालात में बंद कर दिया।
19. హీ, భీ, తో, తక్, భర్, లలో దేనికి ప్రాధాన్యత ఇవ్వ దలచు కుంటే దాని తరువాత వస్తుంది; రామ్ హీ, మైఁ భీ, వహ్ తో, మోహన్ తక్ నహీఁ ఆయా, వహ్ ఆ భర్ జాయే.
ही, भी, तो, तक, भर जिस शब्द पर जोर दिया जाता है, उसके बाद आते हैं। उदा. राम ही, मैं भी, वह तो, मोहन तक नहीं आया, वह आ भर जाये।
20. ‘కేవల్’ అన్నది ముందు వస్తుంది; కేవల్ రామ్ జాయేగా, రామ్ కేవల్ జాయేగా అన్న ప్రయోగాలు సాధారణంగా కనిపిస్తాయి.
`केवल' का प्रयोग पहले या बाद में किया जा सकता है। उदा. केवल राम जायेगा, राम केवल जायेगा। ऐसे प्रयोग सामान्यतः देखे जा सकते हैं।
21. ‘మాత్ర’ అన్నది ముందు, వెనుకలుగా రావచ్చు: మాత్ర దస్ రుపయే దీజియే – దస్ రుపయే మాత్ర చాహియే.
`मात्र' का प्रयोग पहले या बाद में हो सकता है। उदा. मात्र दस रुपये दीजिये – दस रुपये मात्र चाहिए।
22. విస్మయార్థక పదాలు వాక్యారంభంలో వస్తుంటాయి. హాయ్! యహ్ క్యా కియా, అరే! తుమ్ భీ ఆగయే.
विस्मयार्थक शब्द वाक्य के प्रारंभ में आते हैं। उदा. हाय! यह क्या किया?, अरे! तुम भी आ गये?
23. భాషాభాగాలు క్రమ దృష్టితో సమీపంగా వాక్యంలో రావడం తరచు సామాన్యమైన విషయం. లేని పక్షంలో వాక్యప్రయోగం హాస్యాస్పద మవుతుంది. ముఝే గర్మ్ భైంస్ కా దూధ్ చాహియే - ముఝే భైంస్ కా గర్మ్ దూధ్ చాహియే; మరీజ్ కో ఏక్ దూధ్ కా గ్లాస్ పీనేకోదో - మరీజ్ కో దూద్ కా ఏక్ గ్లాస్ పినే కో దో.
संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया आदि भाषा के अंश एक क्रमिक पद्धति में वाक्य में प्रयुक्त होते हैं, यह एक सामान्य बात है। व्याकरण का लिहाज नहीं किये जाने पर इनका प्रयोग हास्यास्पद भी हो सकता है। उदा. मुझे गरम भैंस का दूध चाहिए – मुझे भैंस का गरम दूध चाहिए। मरीज को एक दूध का गिलास पीने को दो – मरीज को दूध का एक गिलास पीने को दो।
2.12 అన్వయం अन्वय (Agreement)
వెంట వెళ్ళడం, అనురూపంగా కావడం లేదా సమానత్వం అని అన్వయానికి అర్ధం. వ్యాకరణ ఏకరూపత అని అన్వయానికి వ్యాకరణంలో అర్ధం చెప్పుకోవాలి. అంటే వాక్యాలలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాల మధ్య వ్యాకరణ ఏకరూపత అన్వయమన్న మాట. ఇది లింగ, వచన, పురుషలలో, మూలరూపంలోనూ, మార్పు చెందిన వికృత రూపంలోనూ ఉంటుంది.
‘अन्वय’-का अर्थ है ‘पीछे जाना’, ‘अनुरूप होना’अथवा ‘समानता’। व्याकरण में इसका अर्थ है ‘व्याकरणिक एकरूपता’ अर्थात् वाक्य में दो या अधिक शब्दों की आपसी व्याकरणिक एकरूपता को अन्वय कहते हैं। यह लिंग, वचन, पुरुष, तथा मूल और विकृत रूप की होती है:
(क) కర్త, క్రియల అన్వయం / कर्ता और क्रिया का अन्वय
1) కర్తకు కారకచిహ్నాలు లేకుంటే క్రియ కర్తానుసారం ఉంటుంది. లడ్ కీ ఖానా ఖా రహీ హై. లడ్ కా రోటీ ఖా రహా హై. కర్మ ప్రభావం క్రియ మీద ఈ స్థితిలో పడదు.
यदि कर्ता के साथ कारक-चिह्न न लगा हो तो क्रिया कर्ता के अनुसार होती है : लड़की खाना खा रही है, लड़का रोटी खा रहा है। यह ध्यान देने की बात है कि कर्म का प्रभाव क्रिया पर ऐसी स्थिति में नहीं पड़ता।
2) పై పరిస్థితికి భిన్నంగా, కర్తతో పాటు నే, కో, సే మొ!! కారక చిహ్నాలు ఉంటే కర్త, క్రియలకు అన్వయం ఉండదు. రామ్ నే రోటీ ఖాయీ, మోహన్ కో జానా హై, సీతా కో జానా హై, లడ్ కోం కో జానా హై, లడ్ కియోం కో జానా హై, రామ్ సే చలా నహీఁ జాతా , సీతా సే చలా నహీఁ జాతా, లడ్ కోం సే చలా నహీఁ జాతా.
इसके विपरीत यदि कर्ता के साथ ने, को, से आदि कारक-चिह्न लगे हों तो कर्ता और क्रिया का अन्वय नहीं होता : राम ने रोटी खाई, मोहन को जाना है सीता को जाना है, लड़कों को जाना है, लड़कियों को जाना है, राम से चला नहीं जाता, सीता से चला नहीं जाता, लड़कों से चला नहीं जाता।
3) కర్త పట్ల ఆదరణ సూచితమైతే ఏకవచన కర్తకు బహువచన క్రియ వస్తుంది. భగవాన్ బుద్ద్ మహాన్ వ్యక్తి థే, మహాత్మా గాంధీ మానవతా కే సచ్చే నేతా థే.
कर्ता के प्रति यदि आदर सूचित करना है, तो एकवचन कर्ता के साथ बहुवचन की क्रिया आती है : भगवान बुद्ध महान व्यक्ति थे, महात्मा गांधी मानवता के सच्चे नेता थे।
4) వాక్యంలో ఒకే లింగ వచన, పురుషలతో కారక చిహ్న రహితంగా కర్త ఉంటే అంతే కాకుండా ‘అవుర్’, ‘తథా’ల తో జోడింప బడి ఉంటే, క్రియ అదే లింగమున బహువచనంలో ఉంటుంది. రామ్, మోహన్, ఔర్ దినేష్ జా రహే హైఁ. షీలా, అల్కా తథా కరుణా కల్ ఆయేంగీ. ఎన్నో పదాలు కలిసి ఒకే వస్తువును నిర్దేశిస్తే క్రియ ఏకవచనంలో ఉంటుంది. : యహ్ రహీ ఉస్ కీ ఘోడా గాడీ.
वाक्य में यदि एक ही लिंग, वचन, पुरुष के कारक-चिह्न रहित कर्ता ‘और’ ‘तथा’ आदि से जुड़े हों तो क्रिया उसी लिंग में बहुवचन में होती है : राम, मोहन और दिनेश विदेश जा रहे हैं; शीला, अलका तथा करुणा कल आएँगी। किन्तु यदि ऐसे कई शब्द मिलकर एक ही वस्तु का बोध करा रहे हों तो क्रिया एकवचन में होगी : यह रही उसकी घोड़ा-गाड़ी।
5) కారక చిహ్న రహితంగా ఏకవచన కర్తలు విభిన్న లింగాలలో ఉంటే, క్రియ పుంలింగ బహువచనంలో ఉంటుంది. వర్ ఔర్ వధూ గయే, మాతాజీ ఔర్ పితాజీ ఆయేంగే.
अलग-अलग लिंगों के दो एकवचन कर्ता यदि कारक-चिह्न रहित हों तो क्रिया पुल्लिंग-बहुवचन में होती है – वर और वधू गए, माताजी और पिताजी आएँगे।
6) భిన్న లింగ వచనాలలో ఎన్నో కర్తలు కారక చిహ్న రహితంగా వస్తే క్రియ వచన దృష్టితో బహువచనంలో ఉన్నా, లింగ దృష్టితో అంతిమ కర్త లింగాన్ని అనుసరించి ఉంటుంది. ఏక్ లడ్ కా ఔర్ కయీ లడ్ కియాఁ జా రహీ హైఁ. ఏక్ లడ్ కీ ఔర్ కయీ లడ్ కే జా రహే హైఁ.
यदि अलग-अलग लिंगों और वचनों के कई कर्ता कारक-चिह्न रहित हों तो क्रिया वचन की दृष्टि से तो बहुवचन में होगी किन्तु लिंग की दृष्टि से अंतिम कर्ता के लिंग के अनुसार: एक लड़का और कई लड़कियां जा रही हैं, एक लड़की और कई लड़के जा रहे हैं।
7) కర్త ఎన్నో పురుషల్లో ఉంటే మొదట ప్రధమ తరువాత మధ్యమ పురుషలో చివర ఉత్తమ పురుష ఉంచాలి. క్రియ అంతిమ కర్తను అనుసరిస్తుంది. ఆవో మోహన్ తుమ్ ఔర్ హమ్ పఢేఁ. మోహన్ ఔర్ తుమ్ జావో; శ్యామ్ తుమ్ ఔర్ మైఁ చలూంగా.
यदि कर्ता कई पुरुषों में हों तो पहले अन्य पुरुष को उसके बाद मध्यम पुरुष को और सबसे अन्त में उत्तम पुरुष को रखना चाहिए। क्रिया अन्तिम के अनुसार होगी। आओ, मोहन तुम और हम पढ़ें : मोहन और तुम जाओ; श्याम तुम और मैं चलूंगा।
8) దర్శన్, ఆంసూ, ప్రాణ్, జోష్ మొ!! కర్త రూపంలో వస్తే క్రియ బహువచనంలో వస్తుంది. బహుత్ దినోం బాద్ ఆప్ కే దర్శన్ హుయే హైఁ. షేర్ కో దేఖ్ తే హీ మేరే తో ప్రాణ్ హీ సూఖ్ గయే.
दर्शन, ऑंसू, प्राण, होश, आदि के कर्ता रूप में आने पर क्रिया बहुवचन में होती है : बहुत दिनों बाद आपके दर्शन हुए हैं, शेर को देखते ही मेरे तो प्राण ही सूख गए।
9) కర్త లింగం తెలియక పొతే క్రియ పుంలింగంలో ఉంటుంది. అభీ అభీ కౌన్ బాహర్ గయా హై?
कर्ता के लिंग का पता न हो तो क्रिया पुल्लिंग होती है : अभी-अभी कौन बाहर गया है?
(ख) కర్మ, క్రియల అన్వయం कर्म और क्रिया का अन्वय
కర్త కారక చిహ్న సహితంగా వస్తే క్రియ కర్మను అనుసరిస్తుంది. రామ్ నే రోటీ ఖాయీ.
సీతానే ఏక్ ఆమ్ ఖాయా. రామ్ నే ఉస్ చిట్ఠీ కో పఢా. అట్లాగే కర్త కారక చిహ్నాలు లేకుండా ఉంటే అప్పుడు క్రియ కర్మాను సారం ఉండదు. రామ్ రోటీ ఖా రహా హై. సీతా చావల్ ఖా రహీ హై.
कर्ता के साथ कारक-चिह्न हो तो क्रिया कर्म के अनुसार होती है : राम ने रोटी खाई, सीता ने एक आम खाया, लड़कों ने वह प्रदर्शनी देखी, मोहन को रोटी खानी है, सीता को अभी अखबार पढ़ना है, शीला से यह खाना अब खाया नहीं जाता, रामू से ये सूखी रोटियां नहीं खाई जातीं, बीमार को रोटी खानी चाहिए, बीमार को दूध पीना चाहिए। क्रिया के कर्म के अनुसार होने के लिए आवश्यक है कि कर्म के साथ कारक-चिह्न न हो। यदि कारक-चिह्न हुआ तो क्रिया उसका अनुसरण नहीं करेगी : सीता ने उस चिट्ठी को पढ़ा, राम ने उस चिट्ठी को पढ़ा। ऐसे ही कर्ता के साथ कारक-चिह्न न हुआ तब भी क्रिया कर्म का अनसुरण नहीं करेगा : राम रोटी खा रहा है, सीता चावल खा रही है।
(ग) కర్త, కర్మలతో నిరపేక్ష క్రియలు कर्ता और कर्म से निरपेक्ष क्रिया:
కర్త, కర్మ కారక చిహ్న సహితంగా వస్తే క్రియ ఎల్లప్పుడూ ఏకవచనంలో ఉంటుంది. ఛాత్ర నే ఛాత్రా కో దేఖా. ఛాత్రా నే ఛాత్ర కో దేఖా. ఛాత్రావోంనే ఛాత్రోంకో దేఖా. మైఁనే (పురుషుడు) ఉసే (స్త్రీ) దేఖా, ఉస్ నే (స్త్రీ) ముఝే (పురుషుడు) దేఖా.
यदि कर्ता और कर्म दोनों के साथ कारक-चिह्न हों तो क्रिया सदा ही पुल्लिंग एकवचन होती है: छात्र ने छात्रा को देखा, छात्रा ने छात्र को देखा, छात्रों ने छात्रा को देखा, छात्राओं ने छात्रों को देखा, मैंने (पुरुष) उसे (स्त्री) देखा, उसने (स्त्री) मुझे (पुरुष) देखा।
(घ) విశేషణ, విశేష్యాలు అన్వయం विशेषण और विशेष्य का अन्वय
విశేషణ అన్వయం కేవలం ఆకారాంత విశేషణాల తోనే వస్తుంది. మిగిలిన అన్ని విశేషణాలు, విశేషణాల అధ్యాయంలో వివరించినట్లు ఎప్పుడు ఏక రూపంగా వస్తాయి. సుందర్ ఫూల్, సుందర్ పత్తీ, సుందర్ ఫూలోం కో, సుందర్ పత్తియాఁ.
विशेषण के अन्वय का प्रश्न केवल उन्हीं विशेषणों के साथ उठता है जो आकारांत होते हैं। शेष सभी विशेषण, जैसा कि विशेषण के अध्याय में कहा जा चुका है, हमेशा एकरूप रहते हैं: सुन्दर फूल, सुन्दर पत्ती, सुन्दर फूलों को, सुन्दर पत्तियां।
(1) ఆకారంత విశేషణాలు విశేష్యాలకు ముందుగా లేదా తరువాత విధేయ విశేషణాలుగా విశేష్య లింగ వచనాలను అనుసరించి వస్తాయి. వహ్ పేడ్ బహుత్ లంబా హై. వహ్ లంబా పేడ్ ఖూబ్ సూరత్ హై. వహ్ లంబీ డాలీ ఫూలోంసే లదీ హై. వహ్ డాలీ లంబీ హై.
आकारांत विशेषण चाहे विशेष्य के पहले आए अथवा बाद में विधेय-विशेषण के रूप में, वह लिंग-वचन में विशेष्य के अनुसार ही रहता है : वह पेड़ बहुत लंबा है, वह लंबा पेड़ खूबसूरत है, वह लंबी डाली फूलों से लदी है, वह डाली लंबी है।
(2) విశేష్యం ప్రాధమిక రూపంలో ఉంటే ఆకారాంత విశేషణలు అదే రకంగా వస్తాయి. అవి వికృత రూపంలో వస్తే విశేషణాలు అదే రూపంగా వస్తాయి. లంబా లడ్ కా గయా, లంబే లడ్ కే కో బులావో. విశేష్యాలు వికృత రూపంలో మార్పు చెందకపోయినా విశేషణాలు పరివర్తితమవుతాయి. పీలా ఫూల్ ఖిలా హై, పీలే ఫూల్ కో తోడ్ లో>
यदि विशेष्य मूल रूप में है तो आकारांत विशेषण भी मूल रूप में आता है, किन्तु यदि वह विकृत रूप में है तो विशेषण भी विकृत रूप में आता है : लंबा लड़का गया, लंबे लड़के को बुलाओ। विशेष्य विकृत रूप में हो किन्तु परिवर्तित न हो, तब भी विशेषण परिवर्तित हो जाएगा : पीला फूल खिला है, पीले फूल को तोड़ लो।
(3) ఒక విశేషణానికి ఎన్నో విశేష్యాలున్నా, ఇవే నియమాలు వర్తిస్తాయి. వహ్ బడా ఔర్ హరా మకాన్ సుందర్ హై. ఉస్ బడే ఔర్ హరే మకాన్ మేఁ కౌన్ రహతా హై?
एक विशेषण के कई विशेष्य हों तब भी ये ही नियम लागू होते हैं: वह बड़ा और हरा मकान सुन्दर है, उस बड़े और हरे मकान में कौन रहता है?
(4) అనేక సమాసరహిత విశేష్యాల విశేషణాలు, సమీపంగా ఉన్న విశేష్యాలను అనుసరిస్తాయి. భోలే భోలే బచ్చే ఔర్ బచ్చియాఁ, భోలీ భోలీ బచ్చియాఁ ఔర్ బచ్చే.
अनेक समासरहित विशेष्यों का विशेषण निकटवर्ती विशेष्य के अनरूप होता है। भोले-भाले बच्चे और बच्चियां, भोली-भाली बच्चियां और बच्चे।
(ड.) సంబంధ, సంబంధిత నామవాచకాల అన్వయం संबंध और संबंधी का अन्वय:
సంబంధ రూపాలకూ విశేషణ నియమాలే (పైన వివరించినవే) వర్తిస్తాయి. ప్రస్తుత సంబంధ రూపాలు విశేషణాలు, సంబంధిత నామవాచకాలు విశేష్యాలు: యహ్ మేరీ ఛడీ హై. యహ్ ఛడీ మేరీ హై. ఉస్ కీ మాతాజీ తథా పితాజీ గయే. ఉస్ కే పితాజీ తథా మాతాజీ గయీఁ.
सम्बन्ध के रूपों पर भी वही नियम लागू होते हैं, जो ऊपर विशेषण के बारे में दिए गये हैं। वस्तुत: सम्बन्ध के रूप विशेषण ही होते हैं तथा सम्बन्धी विशेष्य होता है : यह मेरी छड़ी है, यह छड़ी मेरी है, उसकी माताजी तथा पिताजी गये, उसके पिताजी तथा माताजी गईं।
(च) సర్వనామాలు, నామవాచకాల అన్వయం सर्वनाम और संज्ञा का अन्वय:
1) సర్వనామం ఏ నామవాచకం స్థానంలో వస్తుందో దాని యొక్క లింగ వచనానుసారం ఉంటుంది. వహ్ (సీతా) గయీ, వహ్ (రామ్) గయా, వే (లడ్ కే) గయే, మేరే పితాజీ ఔర్ బడే భాయీ ఆయే హైఁ, వే (లోగ్) కల్ జాయేంగే.
सर्वनाम उसी संज्ञा के लिंग-वचन का अनुसरण करता है, जिसके स्थान पर आता है : वह (सीता) गई, वह (राम) गया, वे (लड़के) गए, मेरे पिताजी और बड़े भाई आए हैं, वे (लोग) कल जाएँगे।
2) మర్యాద సూచించే సందర్భంలో ఏకవచన నామవాచకానికి బహువచన సర్వనామం ప్రయోగించబడుతుంది. పితాజీ ఆయే హైఁ ఔర్ వే ఏక్-దో దిన్ రుకేంగే, ఉస్ కే బాద్ ఉన్హేఁ బొంబాయి జానా హోగా.
आदर के लिए एकवचन संज्ञा के लिए बहुवचन सर्वनाम का प्रयोग होता है : पिताजी आए हैं और वे एक-दो दिन रुकेंगे; उसके बाद उन्हें बम्बई जाना होगा।
3) వర్గ ప్రతినిధి రూపంగా ‘మైఁ’ స్థానంలో ‘హమ్’ రావచ్చును. అదే విధంగా ‘మేరా’ స్థానంలో ‘హమారా’ మొ!! ప్రయోగం జరుగుతుంటుంది. అందు వల్ల సంపాదకులు, ప్రతినిధి బృందం నాయకుడు, దేశ ప్రతినిధి, దేశ పక్షాన మాట్లాడే రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొ!! హమ్, హమారా మొ!! ప్రయోగాలు చేస్తారు. ఒక వేళ వారు మైఁ, మేరా మొ!! ప్రయోగిస్తే వ్యక్తిగత రూపాలుగా అర్థం చేసుకోవాలి.
किसी वर्ग के प्रतिनिधि के रूप में ‘मैं’ के स्थान पर ‘हम’ का प्रयोग होता है। इसी प्रकार ‘मेरा’ के स्थान पर ‘हमारा’ आदि अन्य रूपों का भी। इसीलिए संपादक, प्रतिनिधि-मंडल का नेता, देश का प्रतिनिधि, देश की ओर से बोलनेवाला राष्ट्रपति, प्रधानमंत्री आदि हम, हमारा आदि का ही प्रयोग करते हैं, मैं, मेरा आदि का नहीं। यदि वे मैं, मेरा आदि का प्रयोग करें तो उसका अर्थ उनका व्यक्तिगत रूप आदि होता है।
4) తూ, తుమ్, ఆప్ లు మధ్యమ పురుషలు, ప్రయోగంలో సంబంధిత నామవాచకానుసారం వస్తాయి. మూడింటి తేడా సర్వ నామాలను వివరించినప్పుడు వివరించడం జరిగింది.
तू, तुम, आप तीनों ही मध्यम पुरुष हैं, किन्तु प्रयोग में वे सम्बन्धित संज्ञा के अनुसार आते हैं। तीनों का अन्तर सर्वनाम के प्रसंग में बतलाया जा चुका है।
2.13 అధ్యాహారం अध्याहार
కొన్ని పదాల ప్రయోగం వాక్య నిర్మాణంలో జరగకపోయినా, వాక్యార్ధం వివరణలో వాటిని చెప్పడం జరుగుతుంది. వాక్యంలో అవి లేక పోయినా అర్ధం చేసుకోవడానికి ఆటంకాలు ఏర్పడవు. అటువంటి వాటిని అధ్యాహారాలుగా వ్యవహరిస్తారు. రామ్ జా రహా హై ఔర్ మోహన్ భీ అంటే రామ్ జా రహా హై ఔర్ మోహన్ భీ జా రహా హై అని అర్ధం. కానీ చివరి ‘జా రహా హై’ అధ్యాహారంగా వాక్య సంక్షేపతలో వదిలి వేయబడింది. అధ్యాహారాలు అనేక రకాలు (ఎ) కర్త అధ్యాహారం : సునా హై రాజా సాహబ్ కే ఘర్ చోరీ హొగయీ (బి) క్రియ అధ్యాహారం : (1) లోకోక్తులలో- ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్, నయా నౌదిన్ పురానా సౌదిన్ (2) రామ్ జా రహా హై ఔర్ మోహన్ – ఇక్కడ జా రహా హై అధ్యాహారం (౩) వాక్యాంశ అధ్యాహారం (i) ప్రశ్నోత్తరాలలో – ప్రశ్న – తుమారా నామ్ క్యా హై ? సమాధానం – రామ్ (మేరా నామ్ హై అధ్యాహారం) (ii) ఇతరంగా : వహ్ ఐసా సీధా హై జై సే గాయ్(సీధీ హోతీ హై – అధ్యాహారం)
अध्याहार का अर्थ है, वाक्य का अर्थ करते समय कुछ ऐसे शब्दों को लाना जिन्हें वाक्य बनाते समय छोड़ दिया गया है क्योंकि उनके न रहने पर भी उस प्रसंग में वाक्य को समझने में बाधा नहीं पड़ती। ‘राम जा रहा है और मोहन भी’ वाक्य मूलत: హైहै- ‘राम जा रहा है और मोहन भी जा रहा है’, किन्तु अन्तिम ’जा रहा है’ का अध्याहार करके वाक्य को यह संप्क्षित रूप दे दिया गया है। अध्याहार कई प्रकार का हाता है : (क) कर्ता का अध्याहार – सुना है राजा साहब के घर चोरी हो गई, (ख) क्रिया का अध्याहार – (1) लोकोक्तियों में : घर की मुर्गी दाल बराबर, नया नौ दिन पुराना सौ दिन। (2) राम जा रहा है और मोहन। यहां ‘जा रहा है’ का अध्याहार है, (ग) वाक्यांश का अध्याहार – (अ) प्रश्नोत्तर में : प्रश्न – तुम्हारा नाम क्या है? उत्तर- राम (‘मेरा नाम’ तथा ‘है’ का अध्याहार)। (आ) अन्यत्र : वह ऐसा सीधा है जैसे गाय (‘सीधी होती है’ का अध्याहार)।